Begin typing your search above and press return to search.
ధృవ పోస్ట్ పోన్ అయిపోతోందా?
By: Tupaki Desk | 3 Sep 2016 1:30 PM GMTరామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ.. షెడ్యూల్ ప్రకారం అయితే అక్టోబర్ 7న రిలీజ్ కావాలి. సాధారణంగా చెర్రీ సినిమా రిలీజ్ చేస్తున్నాడంటే.. దానికి పోటీగా వేరే సినిమా ఏదీ రిలీజ్ కాదు. అంతకు ముందు వారం కూడా విడుదల చేసే ధైర్యం ఎవరూ చేయరు. అందుకే చరణ్ సినిమా వచ్చే టైమ్ కి థియేటర్లలో వేరే పెద్ద సినిమాలేమీ ఉండవు. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరంగా చరణ్ సినిమా వస్తుందని చెప్పిన డేట్ కి.. చాలానే మూవీస్ క్యూ కట్టేస్తున్నాయి.
పూరీ-కళ్యాణ్ రామ్ ల ఇజం.. రామ్ నటించిన హైపర్.. ప్రకాష్ రాజ్ మూవీ మనవూరి రామాయణం లాంటి సినిమాలన్నీ దసరా బరిలో ఉన్నట్లు అనౌన్స్ చేసేశాయి. ఇదంతా చూస్తుంటే.. చెర్రీతో పోటీకి ఇంతమంది సై అంటున్నారా అనిపించక మానదు. కానీ అసలు విషయం వేరే ఉందిట. రామ్ చరణ్ ధృవ ఈ దసరాకి రావడం లేదని.. రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తారని.. ఇండస్ట్రీలో చాలామంది దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందిట. అందుకే తమ సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
నిజానికి మూవీ చాలా బాగా వచ్చిందని.. ఔట్ పుట్ పై అల్లు అరవింద్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని అంటున్నారు. అయినా సరే గత రెండు సార్లు అక్టోబర్ నెల రామ్ చరణ్ కి అచ్చి రాలేదు. గోవిందుడు అందరివాడేలే.. బ్రూస్ లీ రిజల్ట్ లు తేడా రావడంతో.. ఆ నెల రావడం రిస్క్ అని డిస్ట్రిబ్యూటర్లందరూ అల్లు అరవింద్ పై ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. దీంతో సెంటిమెంట్ కి తలొగ్గిన అల్లు మామ.. అల్లుడి సినిమాని నవంబర్ కి వాయిదా వేశాడని ఫిలిం నగర్ ఇన్ సైడ్ టాక్.