Begin typing your search above and press return to search.
అది కూడా రాకపోతే ఎలాగయ్యా చరణూ
By: Tupaki Desk | 23 March 2018 12:46 PM GMTమెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి వచ్చాడు రామ్ చరణ్. అయితే మొదటి నుంచి నటనలో చాలా విమర్శలే ఎదుర్కొన్నాడు. ఆ విమర్శల నుంచి బయట పడేందుకు ప్రతీ సినిమాకీ కష్టపడుతూనే ఉన్నాడు. తన సినిమాలతో మాస్ ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే మాస్ జనాలు రోజూ చేసే పని - ఈ మెగాపవర్ స్టార్ కి అసలు రాదట.
రంగస్థలం సినిమా కోసం గుబురు గడ్డం పెంచి - తన లుక్కును పూర్తిగా మార్చేశాడు రామ్ చరణ్. రూపంలోనే కాకుండా వస్త్రధారణలోనూ 1985ల నాటి ఫ్యాషన్‌ను గుర్తు చేస్తూ చరణ్ చేత లుంగీ కట్టించాడు సుకుమార్. అయితే ఈ సినిమాకి ముందు రామ్ చరణ్ కి లుంగీ కట్టుకోవడం కూడా రాదంట. ఈ విషయాన్ని స్వయంగా చెర్రీయే సుక్కుకి చెప్పాడట. సుక్కు లుంగీ గొప్పతనాన్నీ - అందులో ఉండే సౌకర్యాన్ని వివరించి చెప్పాడట. మొదటి రోజు ఎలాగోలా లుంగీతో కష్టపడిన చరణ్ - తర్వాత లుంగీలో ఉండే సౌఖ్యాన్ని తనివి తీరా అనుభవించాడట. రంగస్థలం ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత రామ్ చరణ్ లుంగీ కట్టుకుని ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.
మెగా వారసుడిగా గోల్డెన్ స్ఫూన్ తో పుట్టిన రామ్ చరణ్ కి లుంగీ కట్టుకోవడం తెలియకపోవడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. కానీ మామను చూసి అల్లుఅర్జున్ కొడుకు అయాన్ లుంగీ కట్టినట్టుగా... ‘రిక్షావోడు’ - ‘ముఠామేస్త్రీ’ - ‘ఘరానా మొగుడు’ వంటి సినిమాల్లో లుంగీ కట్టి చిరంజీవి చేసిన సందడిని చూసి - సన్ రామ్ చరణ్ ఎప్పుడూ ఇమిటేట్ చేయలేదా చెప్మా..!