Begin typing your search above and press return to search.
కెన్యాలో చరణ్-ఉపాసనల అడ్వెంచర్ ఇంట్రెస్టింగ్!
By: Tupaki Desk | 30 Oct 2022 4:15 AM GMT`ఆర్ ఆర్ ఆర్` జపాన్ రిలీజ్ సంగతి పక్కనబెడితే! ప్రమోషన్ పేరుతో మెగా దంపతులు రామ్ చరణ్..ఉపాసన జపాన్ ని అలా ఓసారి చుట్టేసారు. సిటీ అందాలన్ని...నైట్ జర్నీ..పార్టీలను ఎంజాయ్ చేసారు. అందమైన లోకేషన్లలో దంపతులిద్దురు అద్భుతమైన ఫోటో సెషన్ తో అలరించారు. భారతీయ దంపతులైనా..అక్కడున్నంత సేపు జపాన్ దంపతుల్లా మెలిగారు.
అలా జపాన్ టూర్ ముగించిన చరణ్..ఉపాసనలు ఇప్పుడు అక్కడ నుంచి ఆఫ్రికాటూర్ వెళ్లారు. ముందుగా కెన్యా కివెళ్లారు. ఇక్కడ ఏకంగా ఓ పెద్ద సాహస యాత్రనే ఆస్వాదించారు. ఈ యాత్ర రిస్క్ అయినా రస్క్ అంత ఈజీగా తీసుకుని చరణ్ ఇక్కడా తన ధైర్య సాహసాల్ని ప్రదర్శించాడు. ఆఫ్రికాలోని సఫారీ ట్రయిల్‌ని సైతం అద్భుతంగా ముగించినట్లు తెలుస్తోంది.
అక్కడున్న అరుదైన వన్యప్రాణులను...వాటి అరుపులు.. ఆవాసానికి సంబంధించిన దృశ్యాలను తానే స్వయంగా ఓ జీప్‌లో ట్రిప్ వేస్తూ వీడియోలు చిత్రీకరిస్తున్నాడు. అవసరమైన చోట పోటోలు తీసారు. అంతే కాదు ఎడారి ప్రాంతంలో అక్కడ కోడి గుడ్లతో స్వయంగా తానే ఆమ్లేట్లు వేసారు. ఆఫ్రికాలోని జనావాసాలకు దూరంగా ఉండే పాంత్రమిది.
అడవి జంతువులు.. వన్యప్రాణులు.. క్రూరమృగాలు ఉండే ప్రాంతం. జీప్ దిగి కాలు కింద పెడితే రిస్క్.. అంతటి రిస్కీ ప్రాంతంలోనూ చరణ్ తన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఆ ట్రిప్ కి సంబంధించిన వీడియోని చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఇలాంటి వైల్డ్ ట్రిప్ చరణ్-ఉపాసనలకు కొత్తేం కాదు. గతంలోనూ సౌత్ఆఫ్రికా లో సింహాల సఫారి టూర్ ని అద్భుతంగా ముగించారు.
ఉపాసన ఏకంగా సింహాలు జూలు నెమెరుతూ వాటితో ఫోటోలు కూడా దిగారు. అయితే ఈ ట్రిప్కి సంబంధించి ఇంకా ఉపాసన ఫోటోలు రివీల్ చేయలేదు. మరి కొసేపట్లో అవి కూడా బయటకువచ్చే అవకాశం ఉంది. దంపతులిద్దరు ఈ ట్రిప్ ముగించుకుని నేరుగా ఇండియాకి తిరిగొచ్చేస్తారు. అటుపై చరణ్ శంకర్ సినిమా షూటింగ్ లో బిజీ అవుతారు. కొత్త షెడ్యూల్ నవంబర్ లో ప్రారంభం కానుంది.