Begin typing your search above and press return to search.
చిట్టిబాబు చైనా జపాన్లకు కు పోతాడా...?
By: Tupaki Desk | 11 Sep 2018 1:48 PM GMTఒక తెలుగు సినిమా అమెరికా.. ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియాల్లో రిలీజ్ కావడం..వసూళ్లు సాధించడం లో వింతేమీ లేదు. ఎందుకంటే అక్కడ మన తెలుగువాళ్ళు భారీ సంఖ్యలో ఉన్నారు. కానీ అదే జపాన్ లాంటి దేశంలో మన సినిమాలు వారి భాషలో రిలీజ్ కావడం.. భారీ వసూళ్లు సాధించడం మాత్రం వింతే. SS రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి' సినిమా విజయంతో అక్కడ రాజమౌళి సినిమాలకు డిమాండ్ పెరిగింది. తాజాగా రాజమౌళి - చరణ్ కాంబో 'మగధీర' ను రిలీజ్ చేస్తే అక్కడ రెండో మిలియన్ డాలర్లు సాధించి 'ముత్తు' పేరిట ఉన్న హయ్యెస్ట్ కలెక్షన్స్ రికార్డు బద్దలు కొట్టింది.
దీంతో రామ్ చరణ్ కు కూడా అక్కడ కొంత పాపులారిటీ వచ్చినట్టే. మరి ఈ ఊపులో రామ్ చరణ్ తాజా బ్లాక్ బస్టర్ 'రంగస్థలం' కూడా జపాన్ వెళ్తుందేమో వేచి చూడాలి. ఇదిలా ఉంటే 'బాహుబలి' రూట్ లో 'మగధీర' ను జపాన్ లో రిలీజ్ చేసినట్టే చైనాలో కూడా రిలీజ్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా కనిపిస్తున్న విషయం. చైనా లో ఆమీర్ ఖాన్ సినిమాలకు భారీ ఆదరణ దక్కుతోంది. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయిజాన్' కూడా చైనాలో సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలన్నిటికీ ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ప్రేక్షకులను ఎమోషనల్ గా టచ్ చేయగలగడం.
మరి చరణ్ సినిమాలు 'మగధీర' - 'రంగస్థలం' చైనాలో రిలీజ్ అయితే కానీ అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఒకవేళ రిలీజ్ అయి హిట్ అయితే మాత్రం తెలుగు సినిమాలకు కొత్త మార్కెట్లు ఓపెన్ అయినట్టే.