Begin typing your search above and press return to search.
రామ్ చరణ్ చెప్పిన కొన్ని నిజాలు
By: Tupaki Desk | 14 July 2016 5:54 PM GMTమెగాస్టార్ చిరంజీవి 150 సినిమా పేరు కత్తిలాంటోడు అన్నది నిజమేనా.. రామ్ చరణ్-సుకుమార్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. ధ్రువ ఫస్ట్ లుక్ ఎప్పుడు.. రిలీజ్ డేట్ ఏది..? ఈ విషయాల్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఐతే రామ్ చరణ్ స్వయంగా ఈ విషయాల్లో ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ఇవాళ సాయంత్రం ఫేస్ బుక్ లో అభిమానులతో చిట్ చాట్ చేసిన చరణ్ తన సినిమాలు.. తన తండ్రీ రీఎంట్రీ మూవీతో పాటు మరికొన్ని అంశాలపై మాట్లాడాడు. ఆ చిట్ చాట్ లో చరణ్ చెప్పిన కొన్ని ముచ్చట్లు..
* చిరంజీవి 150వ సినిమా టైటిల్ కత్తిలాంటోడు కాదు. ఇంకా టైటిల్ ఏమీ అనుకోలేదు. త్వరలోనే ప్రకటిస్తాం.
* కొందరు మెగా అభిమానుల్ని సెలక్ట్ చేసి చిరంజీవి 150వ సినిమా సెట్స్ లో ఆయన్ని కలిసే అవకాశం కల్పిస్తాం.
* సుకుమార్ తో నేను చేయబోయే తర్వాతి సినిమా అక్టోబరులో మొదలవుతుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
* బాబాయి పవన్ కళ్యాణ్ బేనర్లో నేను చేయబోయే సినిమా వచ్చే ఏడాది మొదలవుతుంది.
* ధ్రువ ఫస్ట్ లుక్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలవుతుంది. సినిమా అక్టోబరు 7న రిలీజ్ చేస్తాం.
* ప్రభాస్ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఈ మధ్యే బాహుబలి సెట్స్ లో అతణ్ని కలిశాను.