Begin typing your search above and press return to search.
చరణ్.. ఫ్యాన్సుకు భయంగానే ఉంది
By: Tupaki Desk | 19 Oct 2015 5:10 AM GMTబ్రూస్ లీ వీక్ స్టోరీతో బాక్సాఫీస్ వద్ద తేలిపోయిందన్న విమర్శలొచ్చాయి. చరణ్ కెరీర్ లో ఇలాంటి ఓ చెత్త సినిమా ఉంటుందని మెగాభిమానులు ఊహించలేకపోయారంటూ విమర్శకులు దుమ్మెత్తిపోశారు. అయితే ఇలాంటి పరిస్థితిలో చరణ్ నటించే తర్వాతి సినిమా ఎలా ఉండాలి? అన్న డిష్కసన్ టాలీవుడ్ సర్కిల్స్ లో మొదలైంది. ఇప్పటికే తమిళ హిట్ చిత్రం తని ఒరువన్ రీమేక్ లో నటిస్తున్నా అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు.
తని ఒరువన్ ఓ క్లాస్ సినిమా. స్టయిలిష్ ఎంటర్ టైనర్. ఇందులో హీరో - విలన్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే ప్రతి సారీ హీరో క్యారెక్టర్ ని విలన్ క్యారెక్టర్ డామినేట్ చేసేలా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే అది విలన్‌ని హీరోని చేసే సినిమా. చరణ్‌కి కూడా ఈ చిత్రంలో విలన్ క్యారెక్టరే నచ్చిందని అన్నాడు. అలాంటప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే కొన్ని ప్రమాదాలు తప్పవు. చరణ్ ఇమేజ్ కి తగ్గట్టే హీరో క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ ని డామినేట్ చేయాల్సి ఉంటుంది. అలా కథని మార్చినప్పుడు ఒరిజినల్ లో ఉన్న ఫ్లేవర్ మిస్సయినట్టే.
ఇకపోతే కిక్ 2 లాంటి డిజాష్టర్ ను తెరకెక్కించిన సురేందర్ రెడ్డి చేతిలో ఈ ప్రాజెక్టును పెట్టడం కూడా ఫ్యాన్సుకు భయమేస్తోంది. అన్ని సినిమాలు రేసుగుర్రాలు అవ్వవు. అలాంటప్పుడు చరణ్ ఎలా ఈ ప్రాజెక్టుతో ముందుకు వెళ్లేది. చెర్రీ మరో తప్పు చేస్తున్నాడా? అని అంతా సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాలమే దీనికి సమాధానం చెప్పలి. వెయిట్ అండ్ సీ.