Begin typing your search above and press return to search.
సాయిమాధవ్ కి మెగా సన్మానం
By: Tupaki Desk | 21 Aug 2018 6:22 PM GMTమెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమాకి పనిచేసే అవకాశం రావడమే గొప్ప అనుకుంటే - ఒకటి కాదు వరుసగా రెండు అవకాశాలు అందుకున్నారు బుర్రా సాయిమాధవ్. ఖైదీనంబర్ 150 తర్వాత ఇప్పుడు `సైరా`కు మాటల రచయితగా టైటిల్ కార్డ్ వేయించుకుంటున్నాడు. టాలీవుడ్ లో అత్యంత వేగంగా పాపులరైన మాటల రచయిత అతడు. రంగస్థలం నుంచి వచ్చిన కళాకారుడిగా అతడి కలానికి ఎదురే లేదు. ఆ మాటల్లో పదును - వాడి వేడి ఇండస్ట్రీ దిగ్గజాలకు ఏనాడో తాకింది. అందుకే కెరీర్ పరంగా ఎదురే లేకుండా దూసుకుపోతున్నాడు. సాయిమాధవ్ పని చేసేవి అన్నీ భారీ ప్రాజెక్టులే. అగ్రకథానాయకుల సినిమాలే కావడంతో అతడికి అంతే గొప్ప పేరొస్తోంది.
సాయిమాధవ్ క్రేజు `ఖైదీనంబర్ 150` - `గౌతమిపుత్ర శాతకర్ణి` చిత్రాలతో మరింతగా రెట్టింపైంది. ``పొగరు నా ఒంట్లో ఉంది.. హీరోయిజం నా ఇంట్లో ఉంది!`` అంటూ ఖైదీ నంబర్ 150లో అన్నయ్య పలికిన డైలాగ్ ఆయన రాసినదే. ఆ డైలాగ్ థియేటర్లలో ఓ రేంజులో పేలింది. మెగాఫ్యాన్స్ క్లాప్స్ తో హోరెత్తించారు ఆ డైలాగ్ కి. అందుకే చిరు మళ్లీ పిలిచి సైరాకి రాయించుకుంటున్నారు.
ఇప్పుడు సైరాకి డైలాగ్ రైటర్ గా సాయిమాధవ్ అరుదైన సత్కారాన్ని అందుకున్నారు. నేటి సాయంత్రం మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన అభిమానుల థాంక్స్ మీట్‌లో బుర్రా సాయిమాధవ్ ని వేదికపైకి పిలిచి సన్మానం చేశారు. రామ్ చరణ్ స్వయంగా శాలువా కప్పి సాయిమాధవ్ ని సత్కరించారు. ఇలాంటి గౌరవం చాలా అరుదైనది. ఎంతో ప్రతిభ ఉంటేనే ఇలా సన్మానాలు అందుకోగలరు. సాయిమాధవ్ మునుముందు ఇలాంటి మరెన్నో సత్కారాలు అందుకుంటారనడంలో సందేహమే లేదు. `సైరా- నరసింహారెడ్డి`లో అతడి మాటలు తూటాల్లా పేలతాయనడంలోనూ నో డౌట్స్. ఈ సినిమాతో జాతీయ స్థాయిలోనూ సాయిమాధవ్ కి గుర్తింపు దక్కుతుందనడంలోనూ ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.