Begin typing your search above and press return to search.

#RRR : వచ్చే నెల నుండి హంగామా షురూ

By:  Tupaki Desk   |   14 Feb 2019 12:05 PM GMT
#RRR : వచ్చే నెల నుండి హంగామా షురూ
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న చరణ్‌ - ఎన్టీఆర్‌ ల మల్టీస్టారర్‌ మూవీ ప్రస్తుతం రెండవ షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెల్సిందే. దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం కథ ఏంటీ - హీరోల పాత్రలు ఏంటీ అనే విషయమై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కొందరు స్వాతంత్య్రంకు పూర్వం కథ అంటూ ఉన్నారు. అందుకు తగ్గ కొన్ని సాక్ష్యాలు కూడా వచ్చాయి. అయితే ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. ఎట్టకేలకు వచ్చే నెలలో సినిమా నుండి ఒక పోస్టర్‌ రాబోతుందట.

రాజమౌళి సినిమాల ప్రమోషన్‌ వ్యవహారాలు అన్ని కూడా ఆయన తనయుడు కార్తికేయ చూసుకుంటూ ఉంటాడు. పోస్టర్స్‌ మేకింగ్‌ - ప్రమోషనల్‌ వీడియోస్‌ మేకింగ్‌ ఇలా అన్ని కూడా కార్తికేయ చూసుకుంటాడు. బాహుబలి సినిమాలకు పాత్రల పోస్టర్స్‌ తో ఎలా క్రేజ్‌ పెంచాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆర్‌ మల్టీస్టారర్‌ పోస్టర్‌ పనిలో పడ్డాడు. మొన్నటి వరకు పెళ్లి - ఆ తర్వాత కార్యక్రమాల హడావుడిలో ఉన్న కార్తికేయ మెల్ల మెల్లగా ఆర్‌ ఆర్‌ ఆర్‌ మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

వచ్చే నెలలో రామ్‌ చరణ్‌ బర్త్‌ డే ఉంది. ఆ సందర్బంగా చరణ్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చరణ్‌ బర్త్‌ డే సందర్బంగా విడుదల కాబోతున్న పోస్టర్‌ పై టైటిల్‌ కనిపించబోదు. మొదటి నుండి వేసినట్లుగానే ఆర్‌ ఆర్‌ ఆర్‌ అంటూ లోగో వేయబోతున్నారు. సినిమా టైటిల్‌ విషయంలో ఇప్పట్లో క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. వచ్చే నెల చరణ్‌ పోస్టర్‌ తో మల్టీస్టారర్‌ హంగామా షురూ కాబోతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ బర్త్‌ డే కు ఎన్టీఆర్‌ లుక్‌ కూడా రివీల్‌ చేసే అవకాశం ఉంది.

షూటింగ్‌ చకచక అయితే జరుగుతుంది, కాని సినిమాలో నటించబోతున్న హీరోయిన్స్‌ ఎవరు అనే విషయమై రాజమౌళి ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అతి త్వరలోనే ఈ చిత్రం హీరోయిన్స్‌ ఎంపిక పూర్తి చేసి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.