Begin typing your search above and press return to search.
బ్రూస్ లీ ఇంట్లో పాటలో మెరుపులే
By: Tupaki Desk | 7 Sep 2015 3:53 PM GMTడ్యాన్సులు చేయాలంటే మెగా హీరోల తర్వాతే. చరణ్ - బన్ని - సాయిధరమ్ ఒకరితో ఒకరు పోటీపడి డ్యాన్సులు చేస్తున్నారు. బన్ని - సాయిధరమ్ .. ఈ ఇద్దరితో పోలిస్తే చరణ్ స్టెప్పుల్లో కాస్త క్లాస్ అప్పియరెన్స్ ఉంటుంది. మెగాస్టార్ వారసుడిగా అతడి బాడీ లాంగ్వేజ్ సపరేట్ గా ఉంటుంది. అందుకే మెగాభిమానులు చాలా సందర్భాల్లో చెర్రీ స్టెప్పులకు అడిక్ట్ అయిపోయి విజిల్స్ వేసిన సందర్భాలున్నాయి.
మగధీర - నాయక్ - రచ్చ - ఎవడు .. ఇలా ఏ సినిమాలో పరిశీలించినా అతడికంటూ ఓ క్లాసిక్ స్టయిల్ డ్యాన్సుల్లో కనిపించింది. ఇప్పుడు చరణ్ శ్రీనువైట్ల దర్శకత్వంలో బ్రూస్ లీగా అలరించబోతున్నాడు. టైటిల్ కి తగ్గట్టే అతడు ఓ స్టంట్ మేన్. అలాగని డ్యాన్సులు రావని అనుకోనక్కర్లేదు. ఓవైపు ఫైట్స్ ఇరగదీస్తూనే, మరోవైపు స్టెప్పుల్ని అదరగొట్టేస్తాడని .. ఇదిగో ఇక్కడున్న ఈ పిక్స్ చూస్తేనే చెప్పేయొచ్చు. ప్రస్తుతం బ్రూస్ లీ మొదటి పాటలను అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. దీనికోసం ఇండోర్‌లో అదిరిపోయే సెట్ వేశారు. చూస్తుంటే అర్థం కావడం లేదు. బైక్ లు గాల్లోకి లేచాయి. రోప్ ల ఆధారంగా గాల్లో తేలి ఉన్నాయి. అవన్నీ ఫైనల్ ఔట్ పుట్ లో కనిపించవు. అయితే చరణ్ డ్యాన్సులు మాత్రం హార్లీ డేవిడ్ సన్ బైక్ హార్స్ పవర్ లా ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటాయని ఈ సన్నివేశం చూస్తుంటే అర్థమైపోతోంది.
చుట్టూ హంసల్ని తలపించే అందాల భామలు డ్రమ్ములు వాయిస్తుంటే చరణ్ మెలికలు తిరుగుతూ స్టెప్పులేస్తున్నాడు. ఓ లుక్కు సరిగ్గా వేసి చూస్తే.. మెరుపులా లా.. లా.. ఆడుతా ..! అంటూ అప్పట్లో గ్యాంగ్ లీడర్ లో చిరు స్టెప్పేసినట్టు కనిపించడం లేదూ? అప్పటి ఆ సాంగ్ లో చిరు గెటప్ కూడా ఇలాగే కనిపిస్తుంది. మెరుపులే మరి.