Begin typing your search above and press return to search.
ఆస్కార్ అవార్డుల వేడుకకి రామ్ చరణ్
By: Tupaki Desk | 21 Feb 2023 9:59 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హాలీవుడ్ నటులు, దర్శకులు సైతం ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ పాత్ర మలచిన విధానంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు అంటూ రామ్ చరణ్ ని కూడా పొగిడేస్తున్నారు. రాజమౌళి కారణంగా ఈ మూవీకి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇక ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ అద్భుతమైన అవార్డులని సొంతం చేసుకోవడంతో పాటు ఇప్పుడు నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ఆస్కార్ రేసులో పోటీ పడుతుంది. ఇదిలా ఉంటే జేమ్స్ కామెరూన్ కూడా రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపించడం జరిగింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యి పుత్రోత్సాహాన్ని ఆశ్వదించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్నారు.
ఇక ఈ మాలలోనే ఆయన అమెరికా వెళ్ళడం విశేషం. ఆస్కార్ అవార్డుల వేడుక జరగడానికంటే ముందే ఆస్కార్ అవార్డులకి సంబంధించి సెలబ్రిటీల మీట్ అప్ లు నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో తాజాగా రామ్ చరణ్ యూఎస్ఏ వెళ్ళినట్లు తెలుస్తుంది.
రామ్ చరణ్ తో పాటు రాజమౌళి కూడా ఈ అవార్డుల వేడుకకి వెళ్ళినట్లు సమాచారం. తారక్ కూడా వెళ్ళాల్సి ఉన్నా ఇంట్లో తారకరత్న మృతి చెందడంతో ఆ విషాదంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు.
ఈ నేపధ్యంలో అతను వెళ్ళలేకపోయాడు. దీంతో రామ్ చరణ్ ఒక్కడే అవార్డుల వేడుకకి యూఎస్ వెళ్ళారని తెలుస్తుంది. ఇక ఆ వేడుకలు ముగించుకొని ఇండియా వచ్చిన తర్వాత మరల శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొంటాడని తెలుస్తుంది.
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఒక షెడ్యూల్ జరిగింది. కర్నూల్, హైదరాబాద్, విశాఖపట్నంలో ఈ మూవీకి సంబందించిన కీలక సన్నివేశాలు తెరకెక్కించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.