Begin typing your search above and press return to search.
చెర్రీ... ఉరుకులు పరుగులు
By: Tupaki Desk | 28 Jun 2015 9:32 AM GMTసిసలైన వేటగాడికి చెట్టు, పిట్ట, కొమ్మలు, రెమ్మలు కనిపించవు. కేవలం పిట్ట కనుగుడ్డు ఒక్కటే కనిపిస్తుంది. గురి చూసి కొట్టామా గుడ్డుతో సహా చెట్టుమీంచి పిట్ట కింద రాలాల్సిందే. ఇప్పుడు చరణ్ కూడా అలాంటి విలుకాడే. ఏమాత్రం గురి తప్పకుండా బాణం ఎక్కుపెట్టాడు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేయిస్తున్నాడు. దర్శకనిర్మాతల్ని ఏకంగా దౌడు తీయిస్తున్నాడు.
ఇటీవలి కాలంలో సినిమాల బడ్జెట్ నుంచి ప్రతిదీ ఆరాలు తీస్తున్న ఈ స్టార్ హీరో ఏమాత్రం ఖర్చు పెరగకుండా ప్రతి విషయంలో క్రమశిక్షణతో ఉంటున్నాడని చెప్పుకున్నాం. అనుకున్నట్టే బ్యాంకాక్‌లో ముందుగానే లైకా ఫైటింగ్‌లో పూర్తిగా శిక్షణ తీసుకుని వచ్చాడు. యూరప్ షెడ్యూల్ పూర్తయింది. తర్వాత హైదరాబాద్ పాత బస్తీలో మకాం వేసి అక్కడా కీలకమైన ఇంటర్వెల్ సీన్స్‌లో నటించేశాడు. ఇక మిగిలి ఉన్న పనిని పూర్తి చేయడానికి రెడీ అయ్యాడు.
ప్రస్తుతం శంషాబాద్‌లో కొన్ని ముఖ్య సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇది శ్రీను శైలిలో కనిపించే చెర్రీ సినిమా. ఫైట్స్, కామెడీ రెండిటినీ పక్కాగా బ్లెండ్ చేసి మరీ చెక్కుతున్నాడు శ్రీనూ. చరణ్ లక్ష్యం ఒక్కటే. ఎట్టి పరిస్థితిలో అక్టోబర్ నాటికి రిలీజ్‌కి రెడీ అయిపోవడమే. అందుకోసమే ఈ ఉరుకులు పరుగులు.