Begin typing your search above and press return to search.
‘ఉయ్యాలవాడ’ కోసం చరణ్ మాస్టర్ ప్లాన్
By: Tupaki Desk | 17 May 2017 7:40 AM GMTమార్కెట్ పరిధిని ఎంతగా విస్తరించుకుంటే.. సినిమా మీద అంత ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. ఇందుకు ‘బాహుబలి’ సినిమానే పెద్ద ఉదాహరణ. ఈ సినిమా స్ఫూర్తితో మిగతా నిర్మాతలూ తమ సినిమాను ఎక్కువమందికి చేరువ చేసే దిశగా మార్కెటింగ్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. ‘బాహుబలి’ తర్వాత తెలుగులో అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కబోతున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాను కూడా మిగతా భాషల్లోనూ మార్కెట్ చేసే ప్రయత్నాల్లో ఉంది ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’. ‘ఉయ్యాలవాడ..’ను తెలుగుతో పాటు తమిళం.. హిందీ భాషల్లోనూ తెరకెక్కించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఐతే తమిళ మార్కెట్ చిన్నదే కాబట్టి.. ఎలాగూ తెలుగు సినిమాలు అక్కడ మామూలుగానే కొంచెం పెద్ద స్థాయిలోనే రిలీజవుతున్నాయి కాబట్టి కొత్తగా మార్కెట్ కోసం పెద్ద ప్రయత్నాలేమీ చేయాల్సిన పని లేదు. కానీ హిందీలో ‘ఉయ్యాలవాడ..’ను పెద్ద స్థాయిలో రిలీజ్ చేయాలన్నా.. అక్కడి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి రేకెత్తించాలన్నా.. అంత సులువైన విషయం కాదు. అందుకే నిర్మాత రామ్ చరణ్ ఓ మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ సినిమాను తన బేనర్ మీద రిలీజ్ చేసి.. ఆ చిత్రాన్ని హిందీ జనాలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించిన దర్శక నిర్మాత కరణ్ జోహార్ తో సంప్రదింపులు జరుపుతున్నాడట చరణ్. అమ్మకపు హక్కులు.. వాటాలు గురించి పెద్దగా పట్టింపులు లేకుండా ఆయన ద్వారా సినిమాను రిలీజ్ చేయించాలని పట్టుదలతో ఉన్నాడట చరణ్. కరణ్ కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. ‘ధర్మ ప్రొడక్షన్స్’ బేనర్ మీద ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘ఘాజీ’ కూడా ఉత్తరాది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సౌత్ నుంచి మంచి సినిమాలు పట్టుకొస్తాడన్న గుడ్ విల్ కరణ్ తెచ్చుకున్నాడు. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ని కూడా ఆయనే రిలీజ్ చేస్తే కచ్చితంగా ఆ సినిమాకది ప్లస్ అవుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/