Begin typing your search above and press return to search.
నాతో పాటే ఉపాసనకు రెస్ట్ కావాలి
By: Tupaki Desk | 20 Oct 2015 4:43 AM GMTబ్రూస్‌లీ సినిమా ఫలితం ఎలా ఉన్నా ఈ సినిమా కోసం రామ్ చరణ్ అహోరాత్రులు శ్రమించాడన్నది నిజం. అసలు ఈ సినిమా ప్రారంభం అవ్వకముందే బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడం కోసం దేశ విదేశాల్లో మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ అయ్యాడు. బ్యాంకాక్ - థాయ్ లాండ్ లాంటి చోట నిపుణుల సమక్షంలో ఎంటర్ ది డ్రాగన్ తరహాలో మార్షల్ విద్యలు నేర్చుకున్నాడు. విదేశాల్లో నెల రోజుల పాటు వీటికోసమే ఎంతో శ్రమించాడు. ఆ తర్వాత సెట్స్ లో బోలెడన్ని గాయాలు. అసలే స్టంట్ మన్ క్యారెక్టర్ కావడంతో పోరాట సన్నివేశాల్లో ఎంతో రిస్క్ చేయాల్సి వచ్చింది.
ఓ సారి చేతి మణికట్టుకి గాయం అయ్యింది. ఓసారి భుజానికి దెబ్బతగిలింది. మోకాళ్లకు - వీపు మీద కూడా గాయాలయ్యాయని చరణ్ చెప్పాడు. అందుకే ఈ సినిమా ఆన్ సెట్స్ ఉన్నప్పుడు ఉపాసన కూడా అంతే తీవ్రంగా శ్రమించాల్సొచ్చింది. చెర్రీని కంటికి రెప్పలా కాచుకోవడంలో ఉపాసన కంటిమీద కునుకును కోల్పోయిందంటే అతిశయోక్తి కాదు. అందుకే బ్రూస్ లీ చిత్రాన్ని,. అందులో క్యారెక్టర్ ని వెరీ స్పెషల్ అని చెబుతున్నాడు చరణ్. ఈ సినిమా కోసం ఎంతో శ్రమించాను. నాతో పాటు నా భార్య కూడా అంతే శ్రమించింది. ఇప్పుడు మాకు కాస్త విశ్రాంతి కావాలి. అందుకే ఓ సుదూర ప్రాంతంలో సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నానని చరణ్ చెప్పాడు.
ఇటీవలే శ్రీమంతుడు రిలీజ్ అయ్యాక మహేష్ కూడా ఫ్యామిలీ సమేతంగా టూర్ వెళ్లొచ్చాడు. బాహుబలి సూపర్ హిట్ కొట్టాక ప్రభాస్ - రానా - రాజమౌళి అందరూ విదేశాల్లో రిలాక్స్ అయ్యి తిరిగి వచ్చారు. ఇప్పుడు చరణ్ వంతు వచ్చింది. సినిమా ఫలితం ఏదైనా కఠోరంగా శ్రమించాల్సిందే. ఆ తర్వాత రిలాక్స్ అవ్వడానికి ఏదో ఒక డెస్టినీకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం ఉపాసన-చరణ్ జోడీ చేస్తున్నది అదేనన్నమాట!