Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రితో ఉంటే చెర్రీకి టెన్ష‌నేన‌ట‌

By:  Tupaki Desk   |   29 Dec 2021 3:30 AM GMT
ఆ ఇద్ద‌రితో ఉంటే చెర్రీకి టెన్ష‌నేన‌ట‌
X
డాడీ బాబాయ్ తో చ‌ర‌ణ్ డైనింగ్ టేబుల్ క‌హానీ ఇంట్రెస్టింగ్. పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అవుతున్న సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ అంతా ప్ర‌చారంలో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా హిందీ బాక్సాఫీస్ స్టామినాని పెంచుకునేలా టార్గెట్ చేసి రామ్ చర‌ణ్‌...ఎన్టీఆర్...రాజ‌మౌళి ప్ర‌మోట్ చేస్తున్నారు. బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేయాలి అని కంక‌ణం క‌ట్టుకుని ప్ర‌మోట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్ర‌చారానికి ప‌నికొచ్చే ఏ ప్రోగ్రామ్ ని ఈ ముగ్గురు వ‌దిలిపెట్ట‌డం లేదు. ఇప్ప‌టికే దాదాపు 50కి పైగా ఇంట‌ర్వ్యూలు ఇచ్చారంటే ఈ త్ర‌యం అక్క‌డ మార్కెట్ ని ఏ రేంజ్ లో టార్గెట్ చేసిందో అర్ధ‌మ‌వుతోంది.

అయితే క‌పిల్ శ‌ర్మ హోస్ట్ గా చేస్తోన్న షోలో అలియా భ‌ట్ కి ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది. `ఆర్ ఆర్ ఆర్` మొత్తం క‌థ విని ఒకే చేసారా? లేక కేవ‌లం ఆర్ ( రీడ్ ర‌ణ‌బీర్ క‌పూర్ ) అనే అక్ష‌రం చూసి లాక్ చేసారా? అని ప్ర‌శ్నించ‌గా ఒక్క‌సారిగా ప్రాంగ‌ణం న‌వ్వులతో విర‌బూసింది. ఆర్ అక్ష‌రంతో ఆ ర‌కంగా అలియాని క‌పిల్ శ‌ర్మ ఆట ప‌ట్టించారు. ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ ముందుకు మ‌రో ఆస‌క్తిక‌ర ప్రశ్న వెళ్లింది. చిరంజీవి..ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..చ‌ర‌ణ్ ముగ్గురు డైనింగ్ టేబుల్ వ‌ద్ద కూర్చుని ఉండ‌గా ఒక అభిమాని ఫోటో కోసం వ‌స్తే.. అప్పుడు ఏం చేస్తారు? అని రామ్ చ‌ర‌ణ్ ని క్వ‌శ్చ‌న్ చేసారు.

దానికి జ‌వాబుగా చ‌ర‌ణ్ ఇలా అన్నారు. అభిమాని గురించి చింతించ‌ను. కానీ ద‌ర్శ‌కుడు క‌థ చెప్ప‌డానికి వ‌స్తే గంద‌ర‌గోళానికి గుర‌వుతాను. ఎందుకంటే ఆ ద‌ర్శ‌కుడు మా ముగ్గురిలో ఏ హీరోకి క‌థ చెప్ప‌డానికి వ‌స్తున్నాడో తెలియ‌దు కాబ‌ట్టి! దీంతో ఆడిటోరియం మొత్తం న‌వ్వింది. చ‌ర‌ణ్ టైమింగ్ జోక్ కి అంతా ప‌గ‌ల‌ప‌డి న‌వ్వేసారు. ఇంకా తార‌క్ ..జ‌క్క‌న్న జోకుల‌తో షోకి మ‌రింత వ‌న్నె తీసుకొచ్చారు. ఈ ముగ్గురు బాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీకి ఓ రేంజ్ లో ప్ర‌మోట్ చేస్తున్నారు. హిట్ త‌ప్ప‌క ప‌డాల్సిందే. బాహుబ‌లి రేంజు హిట్టు కొట్టాల‌న్న పంతం క‌నిపిస్తోంది. మ‌రి ఏం జ‌ర‌గ‌నుందో తెలియాలంటే జ‌న‌వ‌రి 6న మొద‌టి ప్రీమియ‌ర్ టాక్ వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.