Begin typing your search above and press return to search.
మాట తప్పని మగధీరుడు
By: Tupaki Desk | 28 Nov 2017 4:27 AM GMTసినిమా ఇండస్ట్రీలో సాధారణంగా నోటితో చెప్పే మాటలకన్నా నోట్లతో చెప్పే మాటలకే విలువ ఎక్కువ. మాట ఇచ్చినా దానికి కట్టుబడి ఉండే అవకాశం తక్కువ. అలాగని అందరినీ అదే గాటన కట్టేయక్కర్లేదు. ఓ మాట ఇచ్చాక వెనక్కి తగ్గకుండా దానిని నిలబెట్టుకునే వాళ్లూ ఉంటారు. మెగా ఫ్యామిలీలో హీరో రామ్ చరణ్ తేజ్ అలా మాట నిలబెట్టుకున్నాడంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ న్యూస్ వినిపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఈ మూవీకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ఎ.ఆర్.రెహమాన్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. సినిమా టీజర్ కు మాత్రం తమన్ మ్యూజిక్ అందించాడు. తమన్ లాంటి బిజీ మ్యూజిక్ డైరెక్టర్ ఓ టీజర్ కోసం పనిచేయడం అంటే గొప్ప విషయమే. అందుకే అతడికి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ తోపాటు తన తరవాత సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం ఇస్తానని రామ్ చరణ్ మాటిచ్చాడట. ఇప్పుడేమో ఈ ప్రాజెక్టు నుంచి రెహమాన్ తప్ప్పుకున్నాడు. దీంతో ఈ అవకాశం తమన్ కు ఇస్తాడేమో అని కొందరు అనుకున్నారు.
సైరా సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా రెహమాన్ ప్లేసులో ఎవరిని తీసుకునేది ఇంకా రామ్ చరణ్ డిసైడవలేదు. అయితే సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న రంగస్థలం-1985 తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేయబోయే తాను హీరోగా చేయబోయే సినిమాకు తమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఓకే చేశాడట. దీంతో రామ్ చరణ్ మాత్రం మాటమీద నిలబడే మనిషినని ప్రూవ్ చేసుకున్నాడు.