Begin typing your search above and press return to search.

వరుణ్ కి క్లాస్ పీకిన చరణ్?

By:  Tupaki Desk   |   19 Sept 2019 8:00 PM IST
వరుణ్ కి క్లాస్ పీకిన చరణ్?
X
మొన్నేదో వాల్మీకి ప్రమోషన్ లో యధాలాపంగా అన్నాడో లేక ఫ్లోలో విలేఖరులు అడిగారని చెప్పాడో కానీ చిరంజీవి బయోపిక్ గురించి వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ ఇప్పటికే హాట్ టాపిక్ గా మారాయి. అన్నయ్య చరణ్ చేయకపోతే పెదనాన్న బయోపిక్ చేసేందుకు నేను రెడీ అని దర్శకుడు హరీష్ శంకర్ అయితే బాగా సెట్ అవుతాడని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ప్రముఖ దినపత్రికల్లో సైతం రావడంతో చరణ్ వరుణ్ కు క్లాస్ పీకినట్టు ఇన్ సైడ్ న్యూస్.

మనమింకా ఋజువు చేసుకోవాల్సింది యాక్టింగ్ పరంగా శిఖరం లాంటి ఆయన్ను అందుకోవాల్సింది చాలా ఉందని ఇప్పుడు తొందరపడి దాని గురించి ఎందుకు మాట్లాడావని సుతిమెత్తగా మందలించినట్టు వినికిడి. చరణ్ అంటే అమితమైన ప్రేమ చూపించే వరుణ్ జరిగిన పొరపాటును ఒప్పేసుకున్నట్టు తెలిసింది. ఇది నిజమో కాదో నిర్ధారించే ఆధారాలు లేవు మీడియాలో ఈ టాపిక్ బాగా నానింది కాబట్టి కాదని కొట్టిపారేయలేం.

బయోపిక్ ల విషయంలో ఏ మాత్రం తొందరపడినా ఎక్కడ లెక్క తప్పినా ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ఎన్టీఆర్ రెండు భాగాలూ నిరూపించాయి. అందులోనూ చిరు లాంటి మెగాస్టార్లను తెరవేల్పులుగా చూసేందుకు అభిమానులు ఇష్టపడతారు కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందనే దాని మీద అంతగా ఆసక్తి ఉండదు. అందుకే అమితాబ్ బచ్చన్ లాంటి బిగ్ బిలు కూడా ఆ ఆలోచన చేయడం లేదు. సో వరుణ్ కి చరణ్ క్లాస్ పీకిన మాట వాస్తవమే అయితే మంచిదే.