Begin typing your search above and press return to search.
#RRR చరణ్ అనుమానాలను పెంచాడే
By: Tupaki Desk | 7 Jun 2018 11:48 AM GMTటాలీవుడ్ రూపురేఖలు మారుతున్నాయి అని గడిచిన ఐదేళ్లలో చాలా ఉదాహరణలు నిలిచాయి. కానీ మల్టీస్టారర్ కథలు సౌత్ లో పెద్దగా రావని హీరోలకు అభిమానులకు ఈగోలు ఎక్కువని వార్తలు చాలానే వచ్చాయి. నార్త్ లో అయితే మరి దారుణంగా వచ్చేవి. కానీ మన స్టార్ హీరోలు కలిస్తే ఎలా ఉంటుందో చూపించడానికి #RRR ఒక ఉదాహరణంగా నిలవనుంది. ఈ సినిమా ఎనౌన్సమెంట్ నుంచి అధికారికంగా మరో విషయం బయటకి రాలేదు.
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ - తారక్.. అంతే.. కథల గురించి రోజుకో కథనాలు వస్తున్నా కూడా అవి ఎంతవరకు నిజమో తెలియదు. నార్త్ మీడియా కూడా ఇటు వైపు కెమెరాను ఎక్కువగా తిప్పుతోంది. కొంచెం తెలిసినా #RRR స్పెషల్ స్టోరీలను ప్రచారం చేస్తోంది. ఇకపోతే ముందు నుంచి ఇది బాక్సింగ్ నేపథ్యంలో ఉన్న కథ అని ఒక టాక్ అయితే ఉంది. కానీ ఎవరు దాన్ని నిజం అనలేదు. జస్ట్ అనుమానం అంతే.
కానీ రీసెంట్ గా రామ్ చరణ్ తారక్ నుంచి అందుకున్న ఛాలెంజ్ ద్వారా హింట్ ఇచ్చాడని తెలుస్తోంది. పిట్ నెస్ ఛాలెంజ్ విసిరితే జిమ్ లో ఎదో ఒక వర్కౌట్ చేసి వీడియో పోస్ట్ చేయొచ్చు. కానీ పర్టికులర్ గా బాక్సింగ్ వీడియో పోస్ట్ చేయడం వైరల్ అయ్యింది. అసలే అనుమానాలు ఎక్కువవుతున్న సమయంలో చరణ్ ఛాలెంజ్ వీడియో ఆ రూమర్ కి మరింత ఊపునిచ్చింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే!