Begin typing your search above and press return to search.
మెహర్ రమేష్ కి మెగా ఆఫర్.. అదా సంగతి?
By: Tupaki Desk | 19 July 2020 5:15 AM GMTకొన్ని వరుస డిజాస్టర్లు తెరకెక్కించిన మెహర్ రమేష్ కెరీర్ డైలమాలో పడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటివరకూ అగ్ర దర్శకుడిగా సత్తా చాటిన మెహర్ ఇక ఆ తర్వాత కోలుకోలేదు. అతడికి మెగా కాంపౌండ్ సహా ఎన్టీఆర్.. ప్రభాస్ వంటి స్టార్ల నుంచి అవకాశాలకు ఛాన్స్ లేకుండా పోయింది. ఆ క్రమంలోనే అతడు నమ్రత మహేష్ వద్ద ప్రొడక్షన్ వ్యవహారాలకు కోఆర్డినేటర్ గా కొనసాగుతున్నారని ప్రచారమైంది. ప్రస్తుతం మహేష్ కాంపౌండ్ బ్యానర్ లో చిన్న సినిమాలు .. ఓటీటీ కంటెంట్ రెడీ అవుతోంది. వీటికి అతడు బాధ్యత వహిస్తున్నాడని ఇటీవల ఫిలింనగర్ లో ప్రచారమైంది.
ఆ క్రమంలోనే మెగా ఫ్యామిలీకి ఎంతో సన్నిహితుడైన మెహర్ కి మెగాస్టార్ నుంచి ఆఫర్ రావడం హాట్ టాపిక్ గా మారింది. బాస్ చిరంజీవి స్వయంగా ఓ మెగా ఈవెంట్లోనే మెహర్ రమేష్ కి అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే మెహర్ కి మెగా కాంపౌండ్ ఎలాంటి ఆఫర్ ఇచ్చింది? అన్నదానికి ఇన్నాళ్లు సరైన ఆన్సర్ లేదు.
తాజా సమాచారం ప్రకారం.. మెహర్ కి ఆఫర్ ఇచ్చిన మాట నిజమే కానీ.. అది పెద్ద తెర ఆఫర్ కాదు. ఓటీటీ ఆఫర్ అని తెలుస్తోంది. మెహర్ ఓ సినిమా తీస్తారు. దానిని అల్లు అరవింద్ ఆహా ఓటీటీలో రిలీజ్ చేస్తారట. దీనిని రామ్ చరణ్ నిర్మిస్తారు. చిరు కానీ చరణ్ కానీ నటించే సినిమాలకు అతడు దర్శకత్వం వహించే అవకాశం అయితే రాలేదని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఓటీటీలో నిరూపించుకుంటే పెద్ద తెర ఛాన్స్ దక్కుతుందేమో చూడాలి.