Begin typing your search above and press return to search.

`జెర్సీ` ద‌ర్శ‌కుడితో చెర్రీ ఆగ‌లేదింకా

By:  Tupaki Desk   |   18 Sep 2022 8:30 AM GMT
`జెర్సీ` ద‌ర్శ‌కుడితో చెర్రీ ఆగ‌లేదింకా
X
`జెర్సీ` అనే జాతీయ‌ అవార్డ్ సినిమా తీయడంతో యువ‌ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి పేరు ఒక్క‌సారిగా మార్మోగిన సంగ‌తి తెలిసిందే. తొలి చిత్ర ద‌ర్శ‌కుడిగా అతడు త‌న సినిమాతో అరుదైన‌ గౌర‌వం అందుకున్నాడు. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు హిందీలోను రీమేకైంది. ఇందులో న‌టించిన నానీకి న‌టుడిగా గొప్ప పేరొచ్చింది.

ఆ త‌ర్వాత రామ్ చరణ్ ని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసాడు గౌత‌మ్. ఇంత‌కుముందే ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది. అయితే మెగాస్టార్ చిరంజీవికి గౌత‌మ్ తిన్న‌నూరి వినిపించిన‌ కథ ఆకట్టుకోకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మెగా క్యాంప్ నుండి వచ్చిన తాజా అప్ డేట్ ప్ర‌కారం.. ఈ ప్రాజెక్ట్ ఇంకా ఆన్ లోనే ఉందని.. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నార‌ని వెల్లడించింది.

ఈ వార్త మెగా ఫ్యాన్స్ ని చాలా సంతోషానికి గురి చేసింది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఆర్.సి15 అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కుతోంది. అలాగే మ‌రోవైపు కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కి చ‌ర‌ణ్ ట‌చ్ లో ఉన్నాడు.