Begin typing your search above and press return to search.
వీడియో: విధేయ రామ కఠోర తపస్సు
By: Tupaki Desk | 6 Jan 2019 5:13 AM GMT`వినయ విధేయ రామ` చిత్రానికి సంబంధించి ఒక్కో పోస్టర్ ఒక్కో రకమైన చర్చకు తావిస్తున్నాయి. రామ్ చరణ్ మునుపెన్నడూ కనిపించనంత మ్యాకోమ్యాన్ అవతారంతో రెచ్చగొడుతున్నాడు. యూత్ కి కొత్త సంవత్సరంలో కొత్త గోల్స్ ని సెట్ చేశాడు అతడు. ఫిట్ మ్యాన్.. ర్యాంబో అవతారంపై పేట పేటనా, పల్లె పల్లెనా ఓ డిబేట్ సాగుతోంది. పట్నం, గల్లీ అనే తేడా లేకుండా అన్నిచోట్లా ఒకటే వేడెక్కించే డిస్కషన్ వెర్రెత్తిస్తోంది. జాన్ ర్యాంబో తరహాలో సిల్వస్టర్ స్టాలోన్ లా.. ఫస్ట్ బ్లడ్ మ్యాకో లుక్.. పైగా పచ్చబొట్లతో ఒకటే వేడి పెంచేసాడు చెర్రీ.
అయితే ఆ రూపం రావడానికి అతడు శ్రమించిన తీరు చూస్తే కళ్లు భైర్లు కమ్మాల్సిందే ఎవరికైనా. తినే ఆహారం నుంచి, చేసే వర్కవుట్ల వరకూ ప్రతిదీ ఎంతో పకడ్భందీ ప్రణాళిక ప్రకారం చేస్తేనే ఇది సాధ్యమైంది. కఠోర శ్రమ అందుకు తగ్గట్టు కటిన వ్యాయామాలు, తిండి పరంగా ప్రణాళిక ఇవన్నీ అంత సులువేం కాదని అర్థమవుతోంది.
తాజాగా ఆన్ లొకేషన్ జిమ్ చేస్తున్న రామ్‌చరణ్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. ఇన్ స్టాగ్రమ్ లో ఉపాసన ఈ వీడియోని షేర్ చేశారు. వీడియో ఇలా లైవ్ లోకి వచ్చిందో లేదో అలా మెగాభిమానుల్లోకి దూసుకుపోతోంది. ఇక ఎంతో కఠోర తపస్సు చేస్తేనే ర్యాంబో లుక్ సాధ్యమైందని అర్థమవుతోంది. ఇక చరణ్ వీవీఆర్ కోసం అజర్ భైజాన్ లాంటి కఠినాత్మకమైన లొకేషన్ కి వెళ్లాడు. అక్కడ ఆన్ సెట్స్ చెర్రీ కష్టం చూస్తుంటే గుండె కరగాల్సిందే. ఆ కష్టానికి ఫలితం అంతా మరో ఐదురోజుల్లో రిలీజవుతున్న వినయ విధేయ రామ బాక్సాఫీస్ రిజల్ట్ రూపంలో అందుకుంటాడేమో..