Begin typing your search above and press return to search.
దసరా బరిలో దిగుతున్న ముగ్గురు రాముళ్లు
By: Tupaki Desk | 19 July 2016 6:19 AM GMTటాలీవుడ్ లో రాముడు అంటే ఎన్టీ రామారావు గుర్తుకు రావాల్సిందే కానీ.. ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో రాముళ్లు చాలా మందే ఉన్నారు. ఎన్టీఆర్ తో పాటు.. రామ్ చరణ్.. కళ్యాణ్ రామ్.. రామ్.. ఇలా పలువురు హీరోలకు రాముడి పేర్లతో రిలేషన్ ఉంది. వీరిలో ముగ్గురు రాముళ్లు ఒకేసారి పోటీ పడేందుకు నిర్ణయించడం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఈసారి దసరా రేస్ లో ముగ్గురు రాముళ్లు (రామ్ లు) పోటీ పడనున్నారు. దసరాకి వస్తున్నట్లు అందరి కంటే ముందే చెప్పేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రీసెంట్ గా ఫేస్ బుక్ ఇంటరాక్షన్ లో కూడా అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో తన ధృవ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగానే చెప్పుడు. మరోవైపు దసరా రిలీజ్ కి సిద్ధమయ్యాడు ఎనర్జిటిక్ హీరో రామ్. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రానికి హైపర్ అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. ఇంకా టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. ఇప్పటికే సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నట్లు మాత్రం ప్రకటించారు.
ఇక నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా దసరాకే వచ్చేందుకు రెడీ అవుతుున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇజం చిత్రం కూడా దసరా బరిలోనే నిలిచే అవకాశాలున్నాయని అంటున్నారు. ముగ్గురు రామ్ లు ఒకే సీజన్ లో పోటీకి దిగడం ఇదే మొదటి సారి. మరి రేస్ లో గెలిచేదెవరో నిలిచేదవెరో?