Begin typing your search above and press return to search.

ఇదిగో బెద‌రూ నీకో మాస్కు నాకో మాస్కు!

By:  Tupaki Desk   |   9 Aug 2020 6:50 AM GMT
ఇదిగో బెద‌రూ నీకో మాస్కు నాకో మాస్కు!
X
మాస్క్ కి ఉన్న ఇమేజ్ సూప‌ర్ స్టార్ కి అయినా ఉందా ఇపుడు? ఏమో సందేహమే! అంతా క‌రోనా మాయ‌. మ‌హ‌మ్మారీ తెచ్చిన కొత్త తంటా ఇది. ఇప్పుడంతా నీకో మాస్కు నాకో మాస్కు!! అంటూ నానా హైరానా ప‌డిపోతున్నారు. ఎక్క‌డికి వెళ్లినా జేబులో మాస్కు లేనిదే ముసుగు వేయ‌నిదే కంటికి కునుకు లేకుండా పోతోంది. ఇక పెళ్లికి పేరంటానికి వెళితే మాస్క్ త‌ప్ప‌నిస‌రి. జ‌న స‌మూహాలు గుమిగూడే చోట మాస్క్ వేయ‌క‌పోతే అంతే సంగ‌తి.

అందుకే నిన్న(శ‌నివారం) రానా-మిహీక పెళ్లికి వెళ్లిన రామ్ చ‌ర‌ణ్ మాస్క్ ధ‌రించి క‌నిపించారు. అంతేనా.. పెళ్లికొడుకుతో ఆ ప‌రాచికం చూశారుగా! ఇదిగో బెద‌రూ నీకో మాస్కు నాకో మాస్కు! అంటూ చెరో మాస్కు పెట్టుకుని కెమెరాకి ఎలా ఫోజిచ్చారో చూసారుగా..! మాస్క్ లేనిదే ఏదీ లేదు. పెళ్లి వేడుక‌లో క‌లిసినా.. సాక్షాత్తూ స్టారాధి స్టార్లే అయినా ఈ ఆప‌సోపాలు త‌ప్ప‌డం లేదు. అయినా కానీ దానిని విధిగా బాధ్య‌త‌గా భావించి మాస్కును ధ‌రించి అభిమానుల్లో స్ఫూర్తిని నింపారు మ‌న హీరోలు. పెళ్లిలో మొహ‌మాటం లేకుండా మాస్కును ధ‌రించండి అని చెప్ప‌డ‌మే ఇది.

మెగాస్టార్ చిరంజీవి మాస్కుకి చేసిన ప్ర‌చారం అంతా ఇంతా కాదు. ఇప్పుడిలా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా పెళ్లి వేదిక సాక్షిగా పెళ్లికొడుకుతో క‌లిసి ఇలా ప్ర‌చారం చేశాడు. స్నేహితులు ఇద్ద‌రూ డ్రెస్ కోడ్ కి త‌గ్గ‌ట్టే కాంబినేష‌న్ మాస్కును ధ‌రించడం ఇంట్రెస్టింగ్. రానా బ్యాచిల‌ర్ లైఫ్ నిన్న‌టితో ముగిసిన‌ట్టే. నిన్న‌టి నుంచే కొత్త జీవితంలో అడుగు పెట్టిన‌ట్టే. స్నేహితుల బ్లెస్సింగ్స్ ని మాస్క్ సాక్షిగా అందుకున్నాడు మ‌రి. నెక్స్ట్ ఏంటి? అన్న‌ది రానానే చెప్పాలి. భ‌ళ్లాలుని హ‌నీమూన్ ప్లాన్ ఎక్క‌డికో?