Begin typing your search above and press return to search.

చరణ్ చూపు గాంధీపై పడిందా?

By:  Tupaki Desk   |   6 Jan 2016 11:30 AM GMT
చరణ్ చూపు గాంధీపై పడిందా?
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త మూవీని ఇంకా స్టార్ట్ చేయలేదు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తని ఒరువన్ రీమేక్ ని ఈ నెలాఖర్లో మొదలుపెడతారని అంటున్నా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే ఏం లేదు. బ్రూస్ లీ నిరాశపరచడంతో.. నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటాన్నాడు చెర్రీ.

మరోవైపు మెగాస్టార్ 150 సినిమా పనులను కూడా చూసుకుంటూ ఉండడం చరణ్ మూవీ ప్రారంభం ఆలస్యం కావడానికి కారణమే అవుతున్నా.. అసలు నెక్ట్స్ మూవీ విషయంలో చెర్రీ ఇంకా ఫైనల్ కాల్ తీసుకోలేదని అంటున్నారు. ప్రస్తుతం చరణ్ సినిమాపై కొత్త వార్త ఒకటి వినిపిస్తోంది. శర్వానంద్ తో ఎక్స్ ప్రెస్ రాజా తీస్తున్న మేర్లపాక గాంధీ.. ఈ మెగా తనయుడికి ఓ సూపర్ లైన్ వినిపించాడట. నిజానికి వీళ్లిద్దరినీ కలిపింది శర్వానందే. చరణ్-శర్వా మంచి మిత్రులు కావడంతో.. తన దగ్గర ఉన్న స్టోరీ లైన్ వినిపించేందుకు చరణ్ తో మీటింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా గాంధీ శర్వాని కోరాడు. ఇలా చరణ్ ను కలిశాక.. గాంధీ చెప్పిన లైన్ నచ్చడంతో.. మరోసారి సందిగ్ధంలో పడ్డాడట చరణ్.

అయితే.. ఎక్స్ ప్రెస్ రాజా రిలీజ్ తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాడు చరణ్. ఒకవేళ శర్వానంద్ తో చేసిన ఎక్స్ ప్రెస్ రాజా మంచి హిట్ కొడితే మాత్రం.. గాంధీకి అవకాశం దక్కినట్లే అంటున్నారు. అయితే.. ఈ స్టోరీని వెంటనే స్టార్ట్ చేస్తారా.. లేక ముందుగా అనుకున్నట్లు తని ఒరువన్ రీమేక్ తర్వాతే ఛాన్స్ ఇస్తాడా అనే విషయం మాత్రం ఇంకా తేలాల్సి ఉంది.