Begin typing your search above and press return to search.

సూపర్‌ కూల్ అండ్ స్టైలిష్ లుక్ లో రామ్‌ చరణ్‌

By:  Tupaki Desk   |   7 Jan 2023 7:00 AM GMT
సూపర్‌ కూల్ అండ్ స్టైలిష్ లుక్ లో రామ్‌ చరణ్‌
X
ఆర్ఆర్ఆర్‌ సినిమా తర్వాత రామ్‌ చరణ్ అంతర్జాతీయ స్థాయి స్టార్‌ అయ్యాడు. ఈ మధ్య కాలంలో విదేశాల్లో జరిగే ఎన్నో కార్యక్రమాల్లో రామ్‌ చరణ్ పాల్గొన్నాడు.. ఇంకా పాల్గొంటూనే ఉన్నాడు. తాజాగా మరోసారి రామ్‌ చరణ్‌ కాలిఫోర్నియాలో జరిగిన ఒక అవార్డు వేడుకకు చరణ్ హాజరు అయ్యాడు.

స్థాయి పెరుగుతున్నా కొద్ది లుక్ మార్చాలి... స్థాయి పెరుగుతున్నా కొద్ది అక్కడి వారికి నచ్చే విధంగా మోడల్ గా ఉండాలి. రామ్‌ చరణ్ ఆ విషయాన్ని నూటికి నూరు శాతం పాటిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటాడు. తాజాగా రామ్‌ చరణ్ లుక్ మరోసారి ఆ విషయాన్ని నిరూపించింది.

బ్లాక్‌ డ్రెస్ లో రామ్‌ చరణ్‌ చాలా కూల్‌ అండ్‌ స్టైలిష్ లుక్‌ లో కనిపిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ తెగ మురిసి పోతున్నారు. రామ్‌ చరణ్ నార్మల్‌ గానే జనాల చూపును ఆకర్షిస్తాడు. ఈసారి బ్లాక్ లో అంతకు మించి అన్నట్లుగా ఆకట్టుకున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక రామ్‌ చరణ్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే శంకర్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఆ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కాబోతుంది. ఆ తర్వాత బుచ్చి బాబు దర్శకత్వంలో ఒక సినిమాను కూడా చరణ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి చరణ్‌ బిజీ బిజీగా ఉన్నాడు. మరో వైపు 2023 లో చరణ్‌ తండ్రిగా ప్రమోషన్‌ పొందబోతున్న విషయం కూడా తెల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.