Begin typing your search above and press return to search.

నీ కోసం ఫ్రీ డార్లింగ్ అంటున్న చరణ్‌

By:  Tupaki Desk   |   2 Jun 2017 4:34 AM GMT
నీ కోసం ఫ్రీ డార్లింగ్ అంటున్న చరణ్‌
X
రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ తో ఓ మూవీ చేస్తున్నాడు. పీరియాడిక్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కుతోందని.. ఇందులో చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడన.. చరణ్- సమంతల పల్లెటూరి ప్రేమకథ సూపర్బ్ గా ఉంటుందని.. ఇలా రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయ్ కానీ.. వీటిలో దేనినీ యూనిట్ ఔనని కానీ, కాదని కానీ చెప్పలేదు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ఓ షెడ్యూల్ పూర్తి కాగా మరికొన్ని రోజుల్లో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఈ గ్యాప్ లో తన వైఫ్ ఉపాసన.. ఫ్రెండ్స్ తో కలిసి లండన్ టూర్ వెళ్లిపోయాడు మెగా పవర్ స్టార్. కొన్ని రోజులుగా లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న చరణ్ కు.. అక్కడి ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. కాకపోతే మన దగ్గర మాదిరిగా మరీ మీద పడిపోరు లెండి. రోడ్డుపై నడుస్తూ కనిపించిన చెర్రీని వీడియో తీసుకుంటూ.. ఓ అమ్మాయి ఫోటో తీసుకోవాలని ముచ్చట పడింది. అయితే.. సహజంగా ఇలాంటి ఫోటోలకు ఛార్జ్ చేయడం అక్కడి కల్చర్ కావడంతో.. 'చరణ్.. ఒక ఫోటో తీసుకున్నందుకు నువ్వు ఎంత ఛార్జ్ చేస్తావ్' అని అడిగింది.

ఈ ప్రశ్నకు 'నీ కోసం ఫ్రీ డార్లింగ్' అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చి ఎంచక్కా తన దారిన తను నడుచుకుంటూ వెళ్లిపోయిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హంగామా చేసేస్తోంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/