Begin typing your search above and press return to search.
రామ్ చరణ్ ఎలా వింటాడంటే
By: Tupaki Desk | 15 Jan 2018 4:40 AM GMTసంక్రాంతి సినిమా సందడి ముగిసిపోయింది. వాటి ఫలితాలు కూడా వచ్చేసాయి కాబట్టి మూవీ లవర్స్ చూపు రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ మీద పడింది. ఇప్పటి నుంచి క్రమం తప్పకుండా భారీ సినిమాలు క్యు కట్టిన నేపధ్యంలో బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా గ్యాప్ వచ్చే అవకాశాలు లేవు. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో రామ్ చరణ్ రంగస్థలం ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో గత ఏడాదిన్నర కాలంగా షూటింగ్ లో ఉన్న ఈ మూవీ ప్రస్తుతం చివరి స్టేజిలో ఉంది. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే అజ్ఞాతవాసి ప్లేస్ లో రంగస్థలం విడుదల అయ్యేది. నిర్మాణంలో జాప్యం, అనుకోని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయక తప్పలేదు. మార్చ్ 30న విడుదల కానున్న రంగస్థలం బిజినెస్ పరంగా కొన్ని ఏరియాలలో ఇప్పటికే రికార్డులు సృష్టించింది.
ఇక ఇందులో రామ్ చరణ్ చెవిటివాడిగా నటిస్తున్నాడు అనే వార్త గత కొంత కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విశ్వనీయ సమాచారం ప్రకారం అది నిజమే అని టాక్. మరి వినపడకపోతే సినిమాలో మిగిలిన పాత్రలతో ఎలా మాట్లాడతాడు అనే కదా మీ డౌట్. ఇతనికి పెదాల కదలికను అర్థం చేసుకునే విద్య వస్తుందట. అంటే లిప్ రీడింగ్ అన్నమాట. రామ్ చరణ్ పోషిస్తున్న చిట్టి బాబు పాత్ర ఇలాగే అవతలి వాళ్ళు ఏం చెబుతున్నారు అనేది అర్థం చేసుకుని మాట్లాడేలా సుక్కు డిజైన్ చేసాడట. మరి సినిమా మొత్తం చెర్రి పాత్ర ఇలాగే ప్రవర్తిస్తుందా లేక మధ్యలోనే ఈ లోపం పోయేలా ఏమైనా ట్విస్ట్ ఉందా అనేది ఇంకా తెలియలేదు.
మార్చ్ 30న విడుదల చేయబోతున్నట్టు గతంలో ఫస్ట్ లుక్ పోస్టర్స్ లోనే చెప్పేసారు కాబట్టి దాని గురించి అనుమానం పడనక్కర్లేదు. అయితే రంగస్థలం సోలోగా రావడం లేదు. సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న మహానటి ఒక్క రోజు ముందు రిలీజ్ కానుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న రంగస్థలంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.