Begin typing your search above and press return to search.

చరణ్ పాలిటిక్స్ ప్రచారాలు చూసితిరా

By:  Tupaki Desk   |   17 March 2018 5:54 AM GMT
చరణ్ పాలిటిక్స్ ప్రచారాలు చూసితిరా
X
ఏ వర్గాల మీద అయినా బేస్ చేసుకొని ఓ స్క్రిప్ట్ అనుకుంటే ఈ రోజుల్లో మనోభావాలు దెబ్బ తింటాయి అంటారు. అది అందరికి తెలిసిన విషయమే.. కానీ రాజకీయాల మీద ఎలాంటి సినిమాలు అయినా తీయవచ్చు. ఎందుకంటే అందులో సినిమాలకు మించిన స్క్రీన్ ప్లేలు ఉంటాయి. జరిగేవన్నీ మోసాలే.. ఎప్పుడు ఎలాంటి ఘటనలు చోటు చేసికుంటాయో ఎవ్వరు చెప్పలేరు. అంతా మనవైపే అనుకున్నా చివరి నిమిషంలో తారుమారవుతుంది.

ఇప్పుడు రంగస్థలం సినిమాలో కూడా అలాంటి రాజకీయ సన్నివేశాలు అలరించబోతున్నాయి. సినిమాలో ఆది పినిశెట్టి ఊరి సర్పంచ్ గా ఎన్నికల్లో నిలబడతాడు. అతనికి అండగా హీరో ఉండి ఎన్నికల ప్రచారంలోకి దిగుతాడు. ఇప్పటికే రియల్ లైఫ్ లో చరణ్ బాబాయ్ జనసేనకు సపోర్ట్ గా ఉన్న సంగతి తెలిసిందే. రంగస్థలం సినిమా 1980 కాలంలో జరిగే కథ. అప్పటి రాజకీయాలకు అనుగుణంగా దర్శకుడు సుకుమార్ సినిమాను తెరకెక్కించాడు.

సినిమాలో పాలిటిక్స్ కి సంబందించిన ఒక పాట కూడా ఉంది. ఆ గట్టునుంటావా నాగన్న.. అనే పాట ఇప్పటికే జనాలకు బాగా నచ్చేసింది. సినిమాలో చరణ్ స్టెప్పులు కూడా అదిరిపోతాయని దర్శకుడు చెబుతున్నాడు. సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ పొలిటికల్ డ్రామా చాలా ఆసక్తిగా ఉండనుందని తెలుస్తోంది. మరి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. మార్చ్ 30న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.