Begin typing your search above and press return to search.

షాకింగ్ : చరణ్ కు గాయం - ఆర్ ఆర్ ఆర్ కు బ్రేక్

By:  Tupaki Desk   |   3 April 2019 11:19 AM GMT
షాకింగ్ : చరణ్ కు గాయం - ఆర్ ఆర్ ఆర్ కు బ్రేక్
X
మెగా ఫాన్స్ కు ఊహించని చిన్న షాక్. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పూణే షెడ్యూల్ లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అనుకోకుండా జిమ్ లో కసరత్తు చేస్తుండగా యాంకిల్ (పాదాన్ని కాలిని కలిపే జాయింట్)కు చిన్న గాయం కావడంతో మూడు వారాల పాటు షూటింగ్ ని వాయిదా వేస్తున్నట్టు టీమ్ అధికారికంగా ప్రకటించింది.

మైనర్ ఇంజురీ అన్న యూనిట్ అభిమానులు ఖంగారు పడతారు అనే ఉద్దేశంతో ఫోటోలు గట్రా లాంటివి పోస్ట్ చేయలేదు. సో తప్పని పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ కు వాయిదా తప్పడం లేదు. రామ్ చరణ్ ఇక్కడికి వచ్చాక అన్ని పరీక్షలు జరిపి ఎన్ని రోజులు రెస్ట్ అవసరం అవుతుందో నిర్ధారించుకుని ఆపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇది అఫీషియల్ గా ట్వీట్ చేయడంతో ఫాన్స్ కామెంట్స్ తో పోస్ట్ వెల్లువెత్తుతోంది. నిన్న లీకైన వీడియోలో తారక్ చరణ్ ల స్నేహాన్ని చూసి ఎవరో దిష్టి పెట్టారని అందుకే ఇలా జరిగిందని బాగా రెస్ట్ తీసుకోమని సలహా ఇస్తూ చాలా మెసేజులు పెట్టారు. రాజమౌళి సినిమాలో హీరోలకు గాయాలు కాకుండా ఏదీ పూర్తి కాదాని కొందరు గత ఉదాహరణలు చెబుతున్నారు.

ఏదైతేనేం అనూహ్యంగా రామ్ చరణ్ గాయం వల్ల సుమారు నెల రోజుల పటు నార్త్ ఇండియా షెడ్యూల్ కు బ్రేక్ పడిపోయింది. ఇది మరీ ఎక్కువ గ్యాప్ కాదు కానీ ప్లాన్డ్ షెడ్యూల్ కాబట్టి మిగిలిన ఆర్టిస్టులతో కొంత కాల్ షీట్స్ సమస్య రావొచ్చు. చరణ్ వీలైనంత త్వరగా కోలుకుని కనిపించాలని సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఉపాసనకు అభిమానులు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం గమనార్హం