Begin typing your search above and press return to search.
వాళ్లే నాకు స్ఫూర్తి -రామ్ చరణ్
By: Tupaki Desk | 9 May 2018 1:30 AM GMTగత కొన్ని నెలల క్రితం రామ్ చరణ్ నటనపై భిన్నాభిప్రాయాలు వెలువడ్డ సంగతి అందరికి తెలిసిందే. ఇంకా తండ్రి మెగా స్టార్ లెవెల్ కి చరణ్ చాలా దూరంలో ఉన్నాడని ఎక్కువగా కామెంట్స్ వచ్చాయి. అయితే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ వాటన్నిటికీ ఎండ్ కార్డ్ పెట్టేశాడు. సినిమాలో అతని నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. సినీ ప్రముఖుల నుంచి ప్రతి సినీ విమర్శకుడి వరకు చరణ్ నటనపై ప్రశంసలను అందించడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
చిట్టిబాబుగా వినికిడి లోపం పాత్రతో కనిపించి ప్రయోగం చేయడానికి ఒక కారణం ఉందట. అందుకు బాలీవుడ్ అమిర్ ఖాన్ సల్మాన్ ఖాన్ వంటి వారు ఆదర్శమని మెగా హీరో చెప్పడం విశేషం. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్నీ తెలిపాడు. ఇంకా ఏమన్నాడంటే.. వాణిజ్య విలువలతో పాటు మంచి కథా బలం ఉన్న చిత్రాలను ఎంచుకొని నటించే వారికీ అమిర్ ఖాన్ - సల్మాన్ ఖాన్ లు ఆదర్శం. వారు చేసిన దంగల్ - భజరంగి భాయీజాన్ సినిమాలు ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చాయి.
కథల ఎంపికలో వారిని బాగా ఫాలో అవుతుంటాను. ఈ తరం వారికి వాళ్లు ఐకాన్. ఇక రంగస్థలం సినిమా గురించి మాట్లాడుతూ.. ఆ సినిమాను నేను నా బిజినెస్ పరిధి గురించి ఎంత మాత్రం ఆలోచించలేదు. 1980 నాటి కథ కావడంతో అందులో పాత్రకి ఎంత వరకు నేను న్యాయం చేయగలను అనే విషయాన్ని గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచించాను. సినిమాలో సెట్స్ ఆడియెన్స్ బాగా నచ్చాయి. రంగస్థలం చిత్రం మంచి విజయం దక్కడంతో మా అందరికి ఎంతగానో సంతృప్తి లభించిందని రామ్ చరణ్ వివరించాడు.