Begin typing your search above and press return to search.

నాన్నకు శ్రీజ అంటేనే ఎక్కువిష్టం- రామ్ చరణ్

By:  Tupaki Desk   |   22 Oct 2015 9:30 AM GMT
నాన్నకు శ్రీజ అంటేనే ఎక్కువిష్టం- రామ్ చరణ్
X
తమ ఇంట్లో అందరి కంటే చెల్లెలు శ్రీజ అంటేనే తన తండ్రి చిరంజీవికి ఎక్కువ ఇష్టమని చెప్పాడు చరణ్. తన జీవితంలో స్త్రీ మూర్తులదే అత్యంత కీలక పాత్ర అని చెబుతూ.. తన తల్లి - అక్క - చెల్లెలు - భార్య గురించి ఓ ఇంటర్వ్యూ లో తన అభిప్రాయాలు వెల్లడించాడు చరణ్. ఆ విశేషాలేంటో చూద్దాం పదండి.

అమ్మ సురేఖ: మా ఇంట్లో నేను ఒక్కొక్కరి గురించి ఒక్కోటి అలవరుచుకున్నా. అమ్మ నుంచి సహనంగా ఉండటం తెలుసుకున్నా. అలసిపోయి ఇంటికొచ్చాక.. అమ్మ పెద్ద రిలాక్సేషన్. బయటి విషయాలేవీ మాట్లాడదు. మంచీ చెడ్డా కనుక్కుంటుంది. చిన్నప్పటి నుంచి నాన్న షూటింగులో బిజీగా ఉంటే.. అమ్మే మమ్మల్ని అన్నీ తానై చూసుకునేది.

చెల్లెలు శ్రీజ: మా చెల్లి అచ్చం మా అమ్మ టైపు. సహనం ఎక్కువ. ఆవేశంతో రియాక్టవదు. చాలా ప్రశాంతంగా, శాంతంగా ఉంటుంది. అందరిలోకి మోస్ట్ లవబుల్ ఛైల్డ్. నాన్నకు గారాల బిడ్డ. చెల్లి నుంచి నేను సహనం, శాంతం నేర్చుకుంటున్నా.

అక్క సురేఖ: మా అక్కకు క్రియేటివిటీ ఎక్కువ. ఫ్యాషన్ డిజైనింగ్ షోలు కూడా చేసిందది. మా నాన్న సినిమాలకు తను స్టైలిస్టుగా పని చేసిన సంగతి చాలామందికి తెలియదు. నాకిప్పుడు స్టైలింగ్ విషయంలో ఓ టేస్టంటూ వచ్చిందంటే అది అక్క చలవే.

భార్య ఉపాసన: మాది పెద్ద కుటుంబం కదా.. ఉపాసన ఎలా సర్దుకుపోతుందా అని ముందు కొంచెం భయపడ్డా. కానీ ఆమె మా ఇంట్లోకి రాగానే అందరితో బాగా సర్దుకుపోయింది. అందరితో చాలా సరదాగా ఉంటుంది. భోజనానికి కూర్చుంటే అందరికీ తనే వడ్డిస్తుంది.