Begin typing your search above and press return to search.

రాంచరణ్ కు గొప్ప గౌరవం.. మోడీ, అంబానీలో వేదిక పంచుకోనున్నారు

By:  Tupaki Desk   |   13 Dec 2022 5:00 PM GMT
రాంచరణ్ కు గొప్ప గౌరవం.. మోడీ, అంబానీలో వేదిక పంచుకోనున్నారు
X
‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల ముందు వరకూ చిరంజీవి కుమారుడుగా ‘రాంచరణ్’ను గుర్తించేవారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తర్వాత రాంచరణ్ తండ్రి చిరంజీవి అన్నంతగా చరణ్ ఎదిగారు. ఎన్డీటీవీ అవార్డు సహా ఎన్నో అవార్డులు, రివార్డులు, పొగడ్తలు రాంచరణ్ సొంతమయ్యాయి. అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’కు ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. ఈ ప్రశంసల పర్వంలో రాంచరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరగనున్న ప్రముఖ స్వామి మహారాజ్ జన్మ శతాబ్ది ఉత్సవాల్లో రామ్ చరణ్ ప్రధాని మోదీతో వేదికను పంచుకోవడానికి సిద్ధమయ్యారు. రేపు డిసెంబర్ 14వ తేదీన జరగనున్న ఈ కార్యక్రమంలో మోడీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం ధృవీకరించింది.

యాదృచ్ఛికంగా రామ్ చరణ్ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్నారు. రాంచరణ్ కూడా అదే కార్యక్రమంలో పాల్గొననున్నాడు. ఈ ఈవెంట్‌కి చరణ్‌ని ఆహ్వానిస్తున్న మహారాజ్ శిష్యుల చిత్రాలు సోషల్ మీడియాలో విడుదలై వైరల్ అవుతున్నాయి.

మోడీ, ముఖేష్ అంబానీ లాంటి దేశంలోనే టాప్ ప్రముఖులు పాల్గొనే ఈ ఈవెంట్‌లో రాంచరణ్ కు మాత్రమే ఆహ్వానం అందడం మన హీరోకు దక్కిన గౌరవంగా చెప్పొచ్చు. టాలీవుడ్ స్టార్ కు మాత్రమే ఈ అరుదైన గుర్తింపు దక్కింది.

ఇదొక ఆధ్యాత్మిక ఘట్టం. రాంచరణ్ ఎప్పుడూ ఈ కాలంలో ‘అయ్యప్ప’ స్వామి మాల ధరిస్తుంటారు. రాంచరణ్ కు భక్తిభావాలు ఎక్కువ. అందుకే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మోడీతోపాటు పాల్గొనే అరుదైన గౌరవం దక్కింది.

రాంచరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వం RC15 సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం అది షూటింగ్ దశలో ఉంది. సుకుమార్‌, బుచ్చిబాబులతో కూడా పనిచేయాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.