Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ దెబ్బకు చరణ్ జాగ్రత్త పడుతున్నాడా?

By:  Tupaki Desk   |   29 Jan 2019 11:12 AM GMT
ఎన్టీఆర్ దెబ్బకు చరణ్ జాగ్రత్త పడుతున్నాడా?
X
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తొలి తెలుగు ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'సైరా' చిత్రంలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు హీరోగా వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే.. నిర్మాతగా కూడా తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నాడు. రీసెంట్ గా
'సైరా' సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది.

'సైరా' కోసం సీనియర్ పాటల రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక పాటకు సాహిత్యం అందించారట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్పదనాన్ని పొగుడుతూ ఈ పాట సాగుతుందట. ఈ పాట సాహిత్యంలో సిరివెన్నెల 'చిరంజీవి' పదాన్ని చాలాసార్లు వాడారట. కానీ చరణ్ కు అది పెద్దగా నచ్చలేదట.. అది మనకు మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలాగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ సిరివెన్నెలను ఆ పదాలను మార్చాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడట. దీంతో సిరివెన్నెల 'చిరంజీవి' ని తొలగించి ఆ ఫ్లోకు సరిపోయే వేరే పదాలతో పాటను పూర్తి చేశారట.

ఈ విషయాన్ని రీసెంట్ గా చిరంజీవి - సిరివెన్నెల వెల్లడించారు. సిరివెన్నెలకు ఈమధ్య పద్మశ్రీ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. ఆయనకు అభినందనలు తెలపడానికి చిరంజీవి కలిసినప్పుడు ఈ విషయం తెలిపారు. ఇదంతా బాగానే ఉందిగానీ సెల్ఫ్ డబ్బా ఎఫెక్ట్ 'ఎన్టీఆర్-కథానాయకుడు' ఫలితంపై తీవ్రంగా పడిందని.. దీంతో చరణ్ సెల్ఫ్ డబ్బాకు ఆమడ దూరం ఉంటూ జాగ్రత్త పడుతున్నాడని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు.