Begin typing your search above and press return to search.

మెగా ఫ్యామిలీని వదలని నాగశౌర్య

By:  Tupaki Desk   |   24 Aug 2018 4:06 AM GMT
మెగా ఫ్యామిలీని వదలని నాగశౌర్య
X
మెగాస్టార్ చిరంజీవికి ఇన్స్పైర్ అవ్వనిది ఎవరు? టాలీవుడ్ లో ఆయన సినిమాలు చూసి ఎదిగి.. హీరోగా ఎదిగినవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో నాగశౌర్య ఒకడు. చిరంజీవి లాగానే ఇండస్ట్రీలోకి ఎవరి అండదండలు లేకుండా అడుగుపెట్టి.. హీరోగా ఇప్పుడో పొజీషన్ లోకి వచ్చాడు. అందుకేనేమో శౌర్య తనకి వీలు చిక్కినప్పుడల్లా చిరంజీవి మీద అభిమానం చాటుకుంటూనే ఉంటాడు. చిరు పుట్టిన రోజు అయినా, పవన్ బర్త్ డే అయినా.. నాగశౌర్య ప్రత్యేకమైన అభిమానం కురిపిస్తూ ఉంటాడు.

‘ఛలో’ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవిని ఆహ్వానించి, ఆయన ఆశీస్సులు తీసుకొని ఘన విజయం సాధించిన శౌర్య, దాన్ని సెంటిమెంట్ గా భావించాడో ఏమో గానీ, ఈ సారి తన ‘@నర్తనశాల’ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్ కు రామ్ చరణ్ ను అతిథిగా ఆహ్వానించాలనుకున్నాడు. అయితే చరణ్ కు బిజీ షెడ్యూల్స్ కారణంగా వెళ్ళడం కుదరడం లేదు. వీలున్నప్పుడు మరోసారి తప్పకుండా వస్తానని నాగశౌర్యకి ప్రామిస్ చేశాడు చెర్రీ. ప్రామిస్ కు అనుగుణంగానే , ఇటీవల చెర్రీ నాగశౌర్య తో దాదాపు ఒక గంట సేపు భేటీ అయ్యాడు. ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు అభిమానం కురిపించుకొని .. పలు విషయాల గురించి చర్చించుకున్నారు. ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ తో ఊపు మీదున్న చెర్రీ.. అదే ఉత్సాహంతో బోయపాటి శ్రీను సినిమాలో నటిస్తూ, మరో వైపు తండ్రి తో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని నిర్మిస్తూ.. చాలా బిజీగా ఉన్నాడు. అలాంటి చరణ్ నాగశౌర్య లాంటి హీరోతో గంట సేపు గడపడం అంటే.. సాధారణమైన విషయం కాదు కదా. మెగా ఫ్యామిలీ పట్ల నాగశౌర్య చాటుకుంటున్నఅభిమానాన్ని చెర్రీ ఈ రకంగా గౌరవించాడని అనుకోవాలి. మరి నాగశౌర్య తన మెగాభిమానాన్ని ఎంత కాలం కొనసాగిస్తాడో చూడాలి.