Begin typing your search above and press return to search.

చిరు దోశ గురించి ఎక్కువగా తెలియదు : చరణ్‌

By:  Tupaki Desk   |   27 Dec 2021 6:56 AM GMT
చిరు దోశ గురించి ఎక్కువగా తెలియదు : చరణ్‌
X
రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ఆర్‌ ఆర్‌ ఆర్‌ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ తో కలిసి దేశ వ్యాప్తంగా ప్రమోషన్ లో భాగంగా తిరిగేస్తున్నాడు. దేశంలోని ముఖ్య నగరాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లు మరియు ప్రెస్ మీట్ లు ఇంటర్వ్యూలు ఇలా అనేక రకాలుగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు.

రామ్‌ చరణ్‌ గురించి ఇతర యూనిట్‌ సభ్యుల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవడానికి ఏమీ లేదు. వారందరు కూడా స్టార్స్ కాబట్టి ఎక్కువగా వారు సినిమాల గురించి మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన విషయాలను షేర్‌ చేస్తూ ఉన్నారు. కాని తాజాగా రామ్‌ చరణ్‌ తమ ఇంట్లో ఉండే చిరు దోశ గురించి మాట్లాడాడు. అమ్మ చేసే చిరు దోశ అంటే నాకు చాలా ఇష్టం అన్నట్లుగా రామ్‌ చరణ్‌ చెప్పుకొచ్చాడు.

ఇంట్లో అందరికి కూడా అమ్మ చేతి తో ఇచ్చే చిరు దోశ అంటే ఇష్టం అన్నట్లుగా రామ్‌ చరణ్‌ చెప్పుకొచ్చాడు. అయితే ఆ దోశ ను నేను తినడమే తప్ప దాన్ని ఎలా చేస్తుంది.. ఏం ఉపయోగిస్తుంది అనే విషయాలను తెలుసుకోలేదు. ఎప్పుడు కూడా నేను అమ్మను ఆ విషయాలను అడగలేదు అన్నట్లుగా రామ్‌ చరణ్‌ చెప్పుకొచ్చాడు.

ఇంట్లో అంతా కూడా స్వీట్స్ ను ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నేను కూడా స్వీట్స్ తింటాను కాని ఎక్కువగా నాకు స్పైసీ ఫుడ్‌ అంటే ఇష్టం అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇంట్లో అందరి కంటే ఎక్కువ స్పైసీగా తినేది నేను. నాకు మాంసాహారం కంటే శాకహారం అంటే ఎక్కువ ఇష్టం. మాసాహారం లో హైదరాబాదీ బిర్యానీ అంటూ భలే ఇష్టం అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

రామ్‌ చరణ్‌ ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదలకు ముందే శంకర్ దర్శకత్వంలో సినిమా ను మొదలు పెట్టాడు. ఆ సినిమాకు సంబంధించిన మొదటి రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. మొదటి షెడ్యూల్‌ ను పుణె లో నిర్వహించగా.. రెండవ షెడ్యూల్‌ ను హైదరాబాద్‌ లో నిర్వహించారు. రెండవ షెడ్యూల్‌ తర్వాత రామ్‌ చరణ్ ఆర్‌ ఆర్‌ ఆర్‌ ప్రమోషన్స్ తో బిజీ అయ్యాడు.

రామ్‌ చరణ్‌ 2023 సంవత్సరంలో శంకర్ మూవీతో రాబోతున్నాడు. 2022 లో రామ్‌ చరణ్ మరో మూవీ కూడా ప్రారంభం అవ్వబోతుందని అంటున్నారు. ఇప్పటికే ఒక యంగ్‌ దర్శకుడికి చరణ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ ను చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది.