Begin typing your search above and press return to search.

'రామరాజు ఫర్ భీమ్' కోసం అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్తున్న చ‌ర‌ణ్...!

By:  Tupaki Desk   |   20 Oct 2020 5:31 PM GMT
రామరాజు ఫర్ భీమ్ కోసం అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్తున్న చ‌ర‌ణ్...!
X
దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్‌ - యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లు కలిసి 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ 'మన్నెందొర అల్లూరి సీతారామ‌రాజు'గా నటిస్తుండగా.. తారక్ విప్లవవీరుడు 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రామ్‌ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' పేరుతో స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ వీడియో అద్భుతమైన విజువ‌ల్స్ తో ప‌వ‌ర్‌ ఫుల్ అల్లూరి పాత్రలో స్టన్నింగ్ బాడీ షేపింగ్ తో చ‌ర‌ణ్ ని ఎలివేట్ చేసింది. ఇదే క్రమంలో ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా 'రామరాజు ఫర్ భీమ్' పేరుతో స్పెషల్ టీజర్ విడుదల చేయాలనుకున్నప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల కుదరలేదు. అయితే అక్టోబర్ 22న ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కొమరం భీమ్ విడుదల చేస్తున్నట్లు 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ ప్రకటించింది.

కాగా, 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ కోసం రామ్‌ చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే రామ్‌ చ‌ర‌ణ్ దీనికి డ‌బ్బింగ్ చెప్పిన‌ట్టు తెలుస్తోంది. డ‌బ్బింగ్ విష‌యంలో చాలా కేర్ తీసుకున్న చరణ్.. ఉద‌యం నిద్ర లేవ‌గానే గొంతుకు సంభందించిన ద్రవ పానీయాలు తీసుకుని మరీ డ‌బ్బింగ్ చెప్పారట. ఇక్క‌డ మరో విష‌యం ఏమిటంటే చ‌ర‌ణ్ అన్ని భాష‌ల్లో ఈ టీజర్ కి వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో వాయిస్ ఓవర్ వినిపించిన ఎన్టీఆర్.. తన మాతృభాషే అనుకునేంత సహజంగా చెప్పినప్పటికీ మలయాళంలో మాత్రం డబ్బింగ్ చెప్పలేదు. ఇప్పుడు చరణ్ మాత్రం అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది.

ఏదేమైనా ఇద్దరు స్టార్ హీరోలకు సంబంధించిన ప్రత్యేక వీడియోలు రిలీజ్ చేయడంలో రాజ‌మౌళిని పొగడకుండా వుండ‌లేరు. ఎందుకంటే మెద‌ట వ‌దిలిన అల్లూరి సీతారామ‌రాజు టీజ‌ర్ లో చరణ్ విజువల్స్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ని కలిపి ఇద్దరు హీరోల‌కి న్యాయం చేశారు. ఇప్పుడు ఈ టీజ‌ర్ లో ఎన్టీఆర్ విజువ‌ల్స్ కి రామ్ చ‌ర‌ణ్ వాయిస్ ఓవర్ ని జతచేయడంలో జక్కన్న తెలివితేట‌ల‌ని మెచ్చుకోవాలి. మొత్తం మీద అక్టోబర్ 22న ఉదయం 11 గంటలకు రామ్ చ‌ర‌ణ్ గ‌ట్టిగా వినిపించ‌బోతున్నాడు. ఇదిలా ఉండగా 'ఆర్.ఆర్.ఆర్'లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ పాత్రలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.