Begin typing your search above and press return to search.

టాప్ 15లో జస్ట్ చరణ్‌ ఒక్కడే!!

By:  Tupaki Desk   |   13 Jun 2017 12:34 PM GMT
టాప్ 15లో జస్ట్ చరణ్‌ ఒక్కడే!!
X
సెలబ్రిటీలు చేసే ప్రతీపనికీ ఏదో ఒక సర్వే రూపంలో ఒక ర్యాంకింగ్ ఇచ్చేస్తున్నారు. ఆదాయంను లెక్కకట్టేందుకు ఫోర్బ్స్ మ్యాగజైన్ సర్వే చేస్తే.. వారి ఇనుఫ్లుయన్స్ లెక్కకట్టేందుకు టైమ్ మ్యాగజైన్ సర్వే చేస్తుంది. ఇక వారిలో మోస్ట్ డిజైరబుల్ ఎవరో తెల్చేందుకు టైమ్స్ ఆఫ్‌ ఇండియా పత్రిక ప్రతీ సంవత్సరం సర్వే చేస్తుంది. ఇప్పుడు అదే తరహాలో మన సెలబ్రిటీల్లో బెస్ట్ ఫ్యాషన్ సెన్స్ ఎవరికి ఉందో చూసేందుకు.. GQ మ్యాగజైన్ కూడా ఒక సర్వే జరుపుతోంది.

బాలీవుడ్ హీరోలు అయితే.. ఇంట్లో నుండి అడుగుపెట్టి జిమ్ కు వెళ్ళేందుకు కూడా చాలా బాగా రెడీ అయ్యి వస్తుంటారు. వారి వేసుకునే ట్రాక్ ప్యాంట్ అండ్ షూస్ కూడా డిజైనర్స్ సెలక్ట్ చేసి తెచ్చినవో.. లేదంటే వరల్డ్ క్లాస్ డిజైనర్లు సెలక్ట్ చేసినవో ఉంటాయి. అలాంటప్పుడు టాప్ 15 సెలబ్స్ లిస్టులో మనోళ్ళ పేరు రావడం కాస్త కష్టమే. అయితే 'డిజిటాల్ డాన్స్' 'జీక్యూ సేస్' 'న్యూ గార్డ్' అంటూ మూడు 15ల లిస్టు ప్రకటించే GQ మ్యాగజైన్.. ఈసారి న్యూ గార్డ్ లిస్టులో రామ్ చరణ్‌ ను పెట్టింది. ఈ లిస్టులో ఎవరు నెం.1 ఎవరు నెం.2 అని ఉండదు కాని.. ఉన్నపేర్లన్నీ ఆల్ఫాబెటికల్ లిస్టులో ప్రకటిస్తారంతే.

అయితే 8వ సారి ప్రకటించబడిన #GQBestDressed లిస్టులో.. తెలుగు నుండి మహేష్‌ బాబు అల్లు అర్జున్ వంటి స్టార్ల పేరు లేకపోవడం గమనార్హం. అలాగే కొందరు తమిళ మలయాళ హీరోలు కూడా ఈ లిస్టులో ఉండాల్సిందే అంటున్నారు నెటిజన్లు. అంటే కేవలం బాలీవుడ్ తో టచ్ ఉన్నవారినే స్టయిలిష్‌ సెలబ్స్ లిస్టులోకి పరిగణిలోకి తీసుకుంటారా? ఇది టూమచ్ కదూ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/