Begin typing your search above and press return to search.

అంచనాలని అందుకోలేకపోయాం: చరణ్

By:  Tupaki Desk   |   5 Feb 2019 7:53 AM GMT
అంచనాలని అందుకోలేకపోయాం: చరణ్
X
సంక్రాంతి సీజన్లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది. కంటెంట్ పరంగా ఈ సినిమా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అవుట్ డేటెడ్ కథా కథనాలు.. లాజిక్ లు లేని సీన్లతో మొదటి షో నుంచి నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు డిస్ట్రిబ్యూటర్లకు బయ్యర్లకు దాదాపు రూ. 30 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది.

ఈ సినిమా ఫలితంపై ఇంతవరకూ రామ్ చరణ్ మాట్లాడలేదు. ఇప్పుడు 'వినయ విధేయ రామ' ఫుల్ రన్ పూర్తయింది కాబట్టి ఈ సినిమాపై స్పందించేందుకు సరైన సమయం అనుకున్నాడేమో గానీ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఒక లేఖ ను పోస్ట్ చేశాడు. 'వినయ విధేయ రామ' సినిమా కోసం ఫిలిం యూనిట్ చాలా కష్టపడ్డారని.. ప్రేక్షకులకు వినోదం అందించడానికి ఎంతో శ్రమించినా దురదృష్టవశాత్తూ తాము ఆనుకున్నవిధంగా ఒక మంచి సినిమాను అందించలేకపోయామని.. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయామని అంగీకరించాడు. టీమ్ మెంబర్స్ కు.. డిస్ట్రిబ్యూటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై ప్రేక్షకుల అభిమానాన్ని ప్రేరణగా తీసుకొని వారికి నచ్చే సినిమాలు చేసేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపాడు. తమకు మద్దతుగా నిలిచిన మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలిపాడు.

ప్రేక్షకుల అభిప్రాయాన్ని గౌరవిస్తూనే.. తమ సినిమా టీమ్ పడిన శ్రమను కూడా అదే సమయంలో గుర్తిస్తూ చరణ్ రాసిన లేఖకు భారీ స్పందన దక్కుతోంది. చరణ్ ను ఈ విషయంలో నెటిజనులు మెచ్చుకుంటున్నారు. రీసెంట్ గా 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' సినిమా డిజాస్టర్ అయిన సమయంలో అమీర్ ఖాన్ కూడా ప్రేక్షకులకు లేఖ రాసి ఈసారి తన సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానని హామీ ఇచ్చాడు. ఆమీర్ ఖాన్ బాటలోనే ఇప్పుడు రామ్ చరణ్ లేఖ రాయడం విశేషం.