Begin typing your search above and press return to search.
లుక్ తోనే అదరగొట్టేసిన చెర్రీ
By: Tupaki Desk | 26 Jan 2016 5:30 AM GMTరామ్ చరణ్ మొదటిసారిగా స్టేజ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. హైద్రాబాద్ లో జరుగుతున్న ఐఫా అవార్డుల వేడుకలో.. డ్యాన్స్ ప్రోగ్రాములు చాలానే ఉన్నా, అన్నిటికంటే ఎక్కువగా రామ్ చరణ్ మెడ్లే పైనా ఆసక్తి నెలకొంది. దీనికి కారణం.. చరణ్ ఇలా లైవ్ పెర్ఫామెన్స్ ఇదే మొదటిసారి కావడమే.
మగధీర బంగారు కోడి పెట్టతో పాటు - ఆరెంజ్ లో పాటలను సెలెక్ట్ చేసుకున్న చెర్రీ.. స్టేజ్ మీద డ్యాన్స్ ఇరగదీసేశాడు. మామూలుగానే డ్యాన్స్ విషయంలో చరణ్ కి వంక పెట్టడానికి ఉండదు. అలాంటిది తాను ఇవ్వబోతున్న మొదటి స్టేజ్ ప్రదర్శనకు.. పక్కాగా ప్రిపేర్ అయి వచ్చాడు. షూటింగ్ లోనే ఒకసారి స్టెప్ చూసి వేసేస్తాడని డ్యాన్స్ డైరెక్టర్లు పొగుడుతూ ఉంటారు రామ్ చరణ్ ని. మరి ముందుగా రిహారల్స్ చేసి మరీ ప్రిపేర్ అయ్యాక.. ఇక చరణ్ డ్యాన్స్ ఏ రేంజ్ లో ఉండాలో.. ఏ మాత్రం తగ్గకుండా చూపించాడు.
డ్యాన్స్ తో పాటు లుక్స్ విషయంలోనూ చెర్రీకి మంచి మార్కులు పడ్డాయి. సూపర్ స్టైలిష్ గా ఉన్న చరణ్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. హెయిర్ స్టైల్ తోపాటు, గెడ్డం లుక్ ని కూడా ఛేంజ్ చేయడంతో.. మెస్మరైజ్ కావాల్సి వచ్చింది. సాధారణంగా అయితే గెడ్డంతో రఫ్ గా కనపడతారు అందరూ. కానీ రామ్ చరణ్ మాత్రం ఇంత స్టైలిష్ గా ఎలా ఉన్నాడన్నది పాయింట్ గా మారింది. మొత్తానికి డ్యాన్స్ తో పాటు లుక్స్ తోనూ ఇరగదేసేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.