Begin typing your search above and press return to search.

150లో చరణ్ ఇలా ఉంటాడు..

By:  Tupaki Desk   |   9 Dec 2016 7:30 PM GMT
150లో చరణ్ ఇలా ఉంటాడు..
X
అటు ఇటుగా ఇంకో 40 రోజులే సమయం ఉంది.. మెగాస్టార్ చిరంజీవిని మళ్లీ వెండితెరపై చూసుకోవడానికి. లేటెస్టుగా ‘ఖైదీ నెంబర్ 150’ టీజర్ కూడా వచ్చేయడంతో మెగా అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. ఈ టీజర్ రావడానికి ముందే ఈ చిత్రంలో తాను కూడా కనిపిస్తానన్న వార్తను అధికారికంగా ప్రకటించి అభిమానుల్లో మరింత ఉత్సాహం తీసుకొచ్చాడు రామ్ చరణ్. ఒక పాటలో తాను ఒక డ్యాన్స్ బిట్ చేసినట్లు చరణ్ వెల్లడించాడు. ఈ కబురు బయటికి వచ్చిన ఒక్క రోజులోనే.. అందులో చరణ్ లుక్ ఎలా ఉంటుందో కూడా తేలిపోయింది.

చిరంజీవి గ్యాంగ్ లీడర్ లుక్ తరహాలో గడ్డం పెంచి.. అట్రాక్టివ్ లుక్ లో కనిపిస్తున్నాడు చరణ్. నీలి రంగు ప్యాంట్.. బ్లాక్ కలర్ టీషర్ట్.. పైగా బ్రౌన్ కలర్ జాకెట్.. బ్లూ కలర్ గాగుల్స్ తో చరణ్ లుక్ మెగా అభిమానుల్ని ఆకట్టుకునేలా ఉంది. రెండు రోజుల కిందటే చరణ్ తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశాడు. ఒక్క రోజు మాత్రమే అతను షూటింగులో పాల్గొన్నాడు. చరణ్ కనిపించేటపుడు లిరిక్స్ ఏమీ ఉండవు. జస్ట్ ఓ బీజీఎం బిట్ కు చరణ్ స్టెప్పులేస్తాడట. తండ్రీ కొడుకులు ఒకే ఫ్రేమ్ లో కనిపించే అవకాశం ఉండొచ్చు. ఇంతకుముందు చరణ్ సినిమా ‘మగధీర’లో చిరు కనిపించాడు. ఇప్పుడు చిరు సినిమాలో చరణ్ కనిపించబోతుండటం.. డ్యాన్సులేయబోతుండటం మెగా అభిమానులకు మహదానందాన్ని కలిగించే విషయమే.