Begin typing your search above and press return to search.
ఈ మేకోవర్ బ్లాక్ బస్టర్ కి రహదారా!!
By: Tupaki Desk | 11 Jun 2016 10:30 PM GMTతన కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన నాలుగు నెలల తర్వాత.. రామ్ చరణ్ సెట్స్ లోకి అడుగుపెట్టాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో 'ధృవ' షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటున్నాడు. కోలీవుడ్ మూవీ తనిఒరువన్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండడంతో.. ముందు నుంచి గెటప్ విషయంలో కేర్ తీసుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు ధృవకి సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ అయింది. కనిపించినంత వరకూ చూస్తే సైడ్ లుక్ మాత్రమే కాబట్టి.. కంప్లీట్ మేకోవర్ గురించి చెప్పలేం. కానీ ఈ సినిమా కోసం ముందునుంచి వెజిటేరియన్ గా మారిపోయి కష్టపడ్డాడు చెర్రీ. అథ్లెటిక్ బాడీ కోసం రెండు నెలలుగా ప్రయత్నిస్తున్నాడు.ఆ విషయం ఫేస్ వరకూ చూస్తే చెప్పేయడం కష్టమే కానీ... స్టిఫ్ నెస్ అయితే మొహంలో కనిపిస్తోంది. ఇక.. మీసకట్టు కూడా మార్చిన విషయం కనిపిస్తోంది. సీరియస్ లుక్ తో ప్రీలుక్ లో బాగా ఆకట్టుకుంటున్నాడు రామ్ చరణ్.
సాధారణంగా రామ్ చరణ్ ఎప్పుడూ రఫ్ లుక్ తోనే ఉంటాడు. కేరక్టర్ ఏదైనా.. తన డ్యాన్సులు - ఫైట్స్ తప్ప మేకోవర్ లో కొత్తదనం చూపించేందుకు ట్రై చేసిన సందర్భాలు తక్కువే. గతంలో జంజీర్ అంటూ బాలీవుడ్ సినిమా చేసినా, అందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించినా.. రఫ్ లుక్ తో గడ్డంతోనే కనిపించాడు. కానీ ఇప్పుడు ధృవ కోసం మాత్రం.. కంప్లీట్ సాఫ్ట్ ఫేస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మీసకట్టును బాగా ట్రిమ్ చేసి.. ఫ్రెష్ లుక్ ని బాగానే ఇచ్చాడు. ఈ మేకోవరే.. తమ హీరోకి బ్లాక్ బస్టర్ సాధించేందుకు రహదారి అవుతుందని.. ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.