Begin typing your search above and press return to search.
మెగా పవర్ లుక్ అదిరిందిగా..
By: Tupaki Desk | 23 Oct 2016 4:45 PM GMTలుక్ పరంగా చూస్తే రామ్ చరణ్ ఇప్పటిదాకా చేసిన తొమ్మిది సినిమాలు ఒకెత్తు. ఇప్పుడు చేస్తున్న ‘ధృవ’ ఒకెత్తు లాగా ఉంది. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి ప్రతి పోస్టర్లోనూ చక్కటి లుక్ లో కనిపించాడు రామ్ చరణ్. అప్పట్లో ‘మగధీర’ సినిమా కోసం లుక్ విషయంలో ఎంత కష్టపడ్డాడో ‘ధృవ’కు కూడా అంతే శ్రమించాడు చరణ్. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూడగానే మెగా అభిమానులకు మతిపోయింది. సామాన్య ప్రేక్షకులు కూడా ధృవ లుక్ విషయంలో పాజిటివ్ గానే స్పందించారు. దసరాకు వచ్చిన ‘ధృవ’ టీజర్ అయితే సెన్సేషనే క్రియేట్ చేసింది. ఈ సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేసింది.
తాజాగా ‘ధృవ’ టాకీ పార్ట్ పూర్తయిన నేపథ్యంలో మెగా పవర్ స్టార్ కొత్త లుక్ ఒకటి రిలీజ్ చేశారు. బ్లూ జీన్స్.. ఎల్లో టీషర్ట్ లో జీపు మీద స్టైల్ గా కూర్చున్న రామ్ చరణ్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది సోషల్ మీడియాలో. రామ్ చరణ్ ఇంత ట్రెండీగా మరే సినిమాలోనూ కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. ‘ధృవ’ షూటింగులో మిగిలి ఉన్నది ఇక రెండు పాటలు మాత్రమే. అవి కూడా త్వరలోనే అవగొట్టేస్తారట. పోస్ట్ ప్రొడక్షన్ తాపీగా చేసుకునే అవకాశం దొరుకుతోంది. డిసెంబరు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబరు 20 ఆడియో అనుకుంటున్నారు. ఆ వేడుకకు పవన్ కళ్యాణ్ ను రప్పించాలన్నది రామ్ చరణ్ ఆలోచన.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/