Begin typing your search above and press return to search.
చరణ్ లుంగీ కట్టు సూపర్ మాస్
By: Tupaki Desk | 15 March 2018 9:58 AM GMTరాంచరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం మూవీ రిలీజ్ కి సిద్ధమైపోతోంది. మార్చ్ 30న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రం కోసం ప్రచారం టాప్ గేర్ లోకి వచ్చేసింది. ఈ సినిమాలో అన్ని పాటలు ఫుల్ హుషారు ఇచ్చేలా సాగుతుండగా.. లేటెస్ట్ గా జిగేలురాణి అంటూ సాగే ఐటెం సాంగ్ ను కూడా విడుదల చేశారు.
లిరికల్ వీడియోలు అన్నిటికీ బోలెడన్ని ఫోటోలతో వీడియో రూపొందించగా.. ఈ జిగేలు రాణి పాటకు మాత్రం 2-3 స్టిల్స్ నే పాట మొత్తం ఉపయోగించారు. అది కూడా పాటకి సంబంధించిన డీటైలింగ్ ఎక్కువగా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఆ ఇచ్చిన ఫోటోలలోనే చరణ్ లుంగీ కట్టి పూజా హెగ్డేకు కాసింత వెనుక డాన్స్ చేస్తున్న స్టిల్ అయితే సూపర్బ్ గా ఉంది. గతంలో కూడా చరణ్ లుంగీ కట్టి పాటకు డ్యాన్స్ వేసిన సందర్భం ఒకటి ఉంది. బ్రూస్ లీ మూవీలో కూడా ఇలాగే లుంగీతో చిందులు వేశాడు చెర్రీ. ఆ పాట సూపర్బ్ గా క్లిక్ అయింది.
ఇప్పుడు మరోసారి లుంగీతో మాస్ లుక్కుతో అలరించబోతున్నాడు చెర్రీ. బ్రూస్ లీ నాటి ఆ లుంగీ డ్యాన్స్ కి.. ఈ చిందులకు చాలానే తేడా కనిపిస్తోంది. ఇది పక్కా రూరల్ క్యారెక్టర్ కావడం.. ఆ పాత్రలో దాదాపు ఏడాదికి పైగా నిమగ్నం అయిన తర్వాత షూట్ చేసిన పిక్ కావడం.. పీరియాడికల్ మూవీ కావడంతో.. లుంగీ లుక్ ని పర్ఫెక్ట్ అనిపించేశాడు చెర్రీ. ఇక పూజా హెగ్డేతో మెగా పవర్ స్టార్ చేసే డ్యాన్సులను తలచుకుని.. ఇప్పటికే తమ స్టైల్ డ్యాన్స్ మొదలుపెట్టేశారు మెగా ఫ్యాన్స్.
వీడియో సాంగ్ కోసం క్లిక్ చేయండి