Begin typing your search above and press return to search.

బ్రూస్ లీ లుంగీ లుక్ అదుర్స్

By:  Tupaki Desk   |   15 Oct 2015 11:29 AM GMT
బ్రూస్ లీ లుంగీ లుక్ అదుర్స్
X
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ ది ఫైటర్ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశమే హద్దు అన్న స్థాయిలో ఉన్నాయి. బ్రూస్ లీకి ఇప్పటివరకూ చాలా లుక్స్ రిలీజ్ చేశారు. చెర్రీ డ్యాన్స్ లు, ఫైట్స్, స్టైలింగ్.. ఇలా చాలా లుక్స్ ఇచ్చారు. అంతే కాదు.. రకుల్ ప్రీత్ సింగ్ అందాలను ఓ రేంజ్ లో ఎర వేశారు. వీటన్నిటికీ మించిన లుక్ ఇప్పుడు రిలీజ్ చేశారు. కరెక్ట్ రిలీజ్ కు గంటల సమయం ఉందనగా... రామ్ చరణ్ లుంగీతో ఉన్న లుక్ విడుదల చేసింది బ్రూస్ లీ యూనిట్.

మాములుగానే లుంగీతో మెగాస్టార్ కేకలు పెట్టిస్తారు. మరి ఆయన కొడుకు లుంగీ కట్టి.. లుంగీ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది. థియేటర్లు అల్లాడిపోవూ. అందుకే చెర్రీతోనూ లుంగీ కట్టించి.. మాంచి మాస్ స్టెప్పులేయించాడు శ్రీనువైట్ల. తండ్రి లుంగీ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూనే... లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గ షర్ట్, టీ షర్ట్ వేసి.. తన స్టయిల్ స్టైలింగ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు చెర్రీ. రేపు ప్రపంచవ్యాప్తంగా 2 వేలకు పైగా రిలీజ్ కానున్న బ్రూస్ లీ.. తెలుగురాష్ట్రాల్లోనే 1500 స్క్రీన్ల పై ప్రదర్శితం కానుంది. రామ్ చరణ్ కి గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికాలోనే 330కి పైగా థియేటర్స్ ఇచ్చారు బ్రూస్ లీ కోసం.

తన కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని, ఫ్యాన్స్ అంచనాలకు మించి ఉంటుందని రామ్ చరణ్ చెప్పడం, అంతకు ముందే ఈ మూవీని ఫుల్ మీల్స్ గాను.. తన పాత్రను డెజర్ట్ గాను మెగాస్టార్ అభివర్ణించడంతో.. అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మొత్తానికి ఇప్పటికైతే లుంగీ లుక్ ఫోటోతో సరిపెట్టేసుకోవాలి. చెర్రీ వేసిన లుంగీ డ్యాన్స్ చూడాలంటే.. రేపు థియేటర్స్ కు వెళ్లాల్సిందే.