Begin typing your search above and press return to search.

మగధీర రచ్చ జపాన్ లో మొదలు!

By:  Tupaki Desk   |   5 Sep 2018 8:36 AM GMT
మగధీర రచ్చ జపాన్ లో మొదలు!
X
దర్శకధీరుడు రాజమౌళి - రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'మగధీర' 2009 లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా ఇప్పుడు జపాన్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోందట. 'బాహుబాలి' జపాన్ లో ఘన విజయం సాధించడం తో రాజమౌళి గత చిత్రాలకు డిమాండ్ భారీగా పెరిగింది. దాంతో 'మగధీర' జపనీస్ వెర్షన్ ను ఆగష్టు 30 న రిలీజ్ చేయగా అక్కడ దుమ్ము దులుపుతోంది.

ఇప్పటికే జపాన్ లో $1 మిలియన్ కలెక్షన్ మార్కుకు అతి దగ్గర్లో ఉంది. ఇక త్వరలో 'బాహుబలి' రికార్డు $1.2 మిలియన్ ను బద్దలు కొట్టే దిశగా పయనిచడం ఖాయం. ఇక జపాన్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాల లిస్టులో సూపర్ స్టార్ రజనికాంత్ సినిమా 'ముత్తు' $1.6 మిలియన్స్ తో టాప్ ప్లేస్ లో ఉంది. ప్రస్తుతం 'మగధీర' జోరు చూస్తుంటే 'ముత్తు' 21 ఏళ్ళ రికార్డుకు ఎసరుపెట్టినా ఆశ్చర్యం లేదని అక్కడి ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు.

అప్పుడెప్పుడో రజనీకాంత్ సినిమాలకు జపాన్ లో మార్కెట్ ఏర్పడింది. అప్పటినుండి రజినీ సినిమాలు అక్కడ రెగ్యులర్ గా రిలీజ్ అవుతుంటాయి. రాజమౌళి సినిమాల పుణ్యమా అని మన తెలుగు సినిమాలకు కూడా ఇప్పుడు మార్కెట్ ఏర్పడింది. ఇక ఫ్యూచర్ లో మన హీరోలకు జపాన్ ఫ్యాన్స్ కూడా ఉంటారన్నమాట!