Begin typing your search above and press return to search.

టైమ్.. టైమింగ్.. గ్యాపే ఇవ్వని చెర్రీ

By:  Tupaki Desk   |   16 Oct 2015 4:36 AM GMT
టైమ్.. టైమింగ్.. గ్యాపే ఇవ్వని చెర్రీ
X
బ్రూస్ లీ ది ఫైటర్ లో.. తన ఒక డైలాగ్ ని ఆడియో ఫంక్షన్ రోజునే చెప్పేశారు మెగాస్టార్. ఇప్పుడు టైమే గ్యాప్.. టైమింగ్ లో ఏ గ్యాప్ ఉండదనే డైలాగ్ చిరు చెప్పారని తెలుస్తోంది. మెగా వారసుడి లెక్క కూడా ఇలాగే ఉంది.. ఈ ఏడాది సినిమాల రిలీజ్ లను చూస్తే.

ఫస్టాఫ్ లో పటాస్ - టెంపర్ - సన్నాఫ్ సత్యమూర్తి - లయన్ తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. వీటి లెక్క బాగానే ఉన్నా.. సెకండాఫ్ వచ్చేసరికి కౌంటింగ్ లో తేడా కొట్టింది. అంటే సక్సెస్ రేషియో ఉంది కానీ.. సినిమా రిలీజ్ లు మాత్రం బాగా లేట్ అయిపోయాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది బాహుబలి గురించే. ఎప్పుడో వస్తానని చెప్పి.. చివరికి హిందీ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఒత్తిడితో.. జూలై 10కి వచ్చాడు బాహుబలి.

ఆ తర్వాత లెక్క శ్రీమంతుడిది. జూలై 17కి వస్తానని చెప్పి.. వాయిదా వేసుకుని ఆగస్ట్ 10కి రిలీజ్ అయిందీ సినిమా. కాకపోతే ఇది బాహుబలి కోసం కావాలని చేసిన త్యాగం లెండి. దీని తర్వాత వచ్చిన బిగ్ మూవీ కిక్2. ఇది కూడా వాయిదాలు పడీపడీ.. చివరకు ఎన్టీఆర్ చలవతో గట్టెక్కి - సిల్వర్ స్క్రీన్ పైకి చేరుకుంది. ఇక రుద్రమదేవి సంగతైతే చెప్పనే అక్కర్లేదు. అసలొస్తుందా రాదా అని కూడా అనిపించేసింది ఓ టైంలో. ఇప్పుడు అక్టోబర్ 22న రావాల్సిన అఖిల్ పరిస్థితీ ఇదే. గ్రాఫిక్ వర్క్ కంప్లీట్ అవలేదంటూ ఓ సారి చెప్పేసి.. తప్పుకున్నాడు. మధ్యలో కంచె - సైజ్ జీరో లాంటివి వాయిదా పడిపోయి.. సరైన సమయం కోసం ఎదురుచూపులు చూస్తున్నాయి.

ఈ ఏడాది సెకండాఫ్ లో ఇన్ని సినిమాల వాయిదా పర్వాలు కొనసాగుతుంటే.. బ్రూస్ లీ లెక్క మాత్రం వేరేగా ఉంది. అక్టోబర్‌ 16 రిలీజ్ డేట్ ని ముందే చెప్పాడు. అది కూడా 5 నెలల ముందే చెప్పేశారు. చెప్పిన డేట్ ని అందుకోవడానికి రెండేసి షిఫ్ట్ లు - రెండేసి యూనిట్లు చొప్పున షూట్ చేశారు. చివరి రోజునైతే ఏకంగా 24 గంటలు ఆగకుండా షూట్ చేసి కంప్లీట్ చేసి.. చెప్పిన డేట్ కి థియేటర్లలోకి తెచ్చారు. టైమ్ గ్యాపంతే.. టైమింగ్ లో ఉండదని చిరు చెబ్తే.. టైమ్ - టైమింగ్ రెండింటినీ కవర్ చేసేస్తున్నాడు 'చిరుత'నయుడు.