Begin typing your search above and press return to search.

కండలు పెంచే ప్లాన్ లో మగధీరుడు

By:  Tupaki Desk   |   31 Oct 2017 6:54 AM GMT
కండలు పెంచే ప్లాన్ లో మగధీరుడు
X
రొటీన్ సినిమాలు ఎన్ని రోజులు చేస్తాం.. కొందరు ప్రేక్షకులు ఒప్పుకోకపోతే ఏంటి? అయినా మనం మారితే వారు కూడా మారతారు. రెగ్యులర్ ఆడియెన్స్ ని మనమే మార్చుకోవాలి. కొత్తగా కనిపించి వారిని ఆకర్షించాలి. ఈ మాటలు ఇప్పుడు మాన టాలీవుడ్ హీరోలు బాగా ఫాలో అవుతున్నారు. రొటీన్ కి బిన్నంగా వారి అభిమానులకు కొత్త లుక్స్ తో కనిపించి వారి చేత విజిల్స్ వేయిస్తున్నారు.

ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తనదైన శైలిలో సినిమాలను చేస్తూ అలరిస్తున్నాడు. సినిమా సినిమాకి కొత్త లుక్ తో కనిపించి వావ్ అనిపిస్తున్నాడు. చిరుత మొదలుకొని చివరగా వచ్చిన ధ్రువ వరకు మనోడు కొంచెం కొత్త లుక్స్ తోనే దర్శనం ఇచ్చాడు. మగధీర - గోవిందుడు అందరివాడేలే అలాగే ధ్రువ సినిమాల్లో చెర్రీ లుక్స్ సూపర్బ్ అనిపించాయి. ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న రంగస్థలం 1985 లో కూడా గడ్డంతో కనిపించనున్నాడు. ఈ సినిమా అయిపోగానే చెర్రీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాను ఒకే చేశాడు. ప్రస్తుతం శ్రీను స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

అయితే ఆ సినిమాలో కూడా కొత్త లుక్ లో కనిపించబోతున్నాడట చెర్రీ. బోయపాటి సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కే ఆ సినిమా కోసం చరణ్ కండలు పెంచనున్నాడట. రంగస్థలం 1985 షూటింగ్ డిసెంబర్ లో ఫినిష్ చేసి ఫుల్ గా వర్కౌట్స్ మొదలు పెట్టే ఆలోచనలు రామ్ చరణ్ ఉన్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.