Begin typing your search above and press return to search.
చరణ్ సినిమాతో.. మాస్ డైరక్టరే
By: Tupaki Desk | 18 Jun 2017 7:48 AM GMTమన రోజు వారి జీవనంలో సినిమా ప్రభావం చాలా ఉందని చెప్పవచ్చు. ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాలో వేసుకున్న చొక్కా నుండి వాడే వస్తువు వరకు మాటలాడే మాట నుండి మన జీవితాన్ని చూసే విధానం వరకు అన్నింటి పైనా వాటి ప్రభావం ఉంటుంది. ప్రతి హీరో ప్రభావం ఎంతో కొంత మన యూత్ పై ఉంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా రంగస్థలం 1985 కూడా అటువంటి గొప్ప ప్రభావమే చూపిస్తుంది అంటున్నారు సుకుమార్ అండ్ టీమ్.
సుకుమార్ ఇంతవరకు మాస్ ఎలిమెంట్స్ పెట్టి సినిమా తీయలేదు. ఎంచుకున్న ప్రతి సినిమా ముందు సినిమా కన్నా భిన్నంగా అప్పటి ట్రెండ్ కు కొత్తగా ఎంచుకొనేవాడు. ‘100% లవ్’ కానీ ‘1 నేనొక్కడినే’ కానీ ఆ తరువాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ కానీ మనం పరిశీలిస్తే అన్నీ క్లాసిక్ టచ్ ఉండి కొన్ని వర్గాలు ప్రేక్షకులుకు మాత్రమే బాగా నచ్చే అంశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వస్తున్న రామ్ చరణ్ సినిమాలో వాటి అన్నింటిని పక్కన పెట్టి పూర్తి పల్లెటూరు కుర్రవాడు ఎలా ఉంటాడో ఎలా ఆలోచిస్తాడో అలా తీర్చిదిద్దారట. హీరో లుక్ కానివ్వండి.. కత నడిచే పద్దతి కాని.. ఇన్నాళ్ళూ ఒకలా ఉంటే ఇప్పుడు ఒకలా ఉంటుందట. ఈ సినిమాలో గెడ్డం తో నలిగిన చొక్కతో పైకి ఎత్తి కట్టిన లుంగీ తో కనిపించి అందరినీ ఆనందపరిచాడు. ఈ సినిమా విడుదల తరువాత రంగస్థలం లుంగీ స్టైల్ ఒక ట్రేడ్ మార్క్ అవుతుందట. చరణ్ యాస, శైలి, అన్నీ చాలామంది పల్లెటూరు యువకులుకు ఫాలో అవ్వడానికి ఒక ట్రెండ్ దొరుకుతుంది అని చెబుతున్నారు. ఈ సినిమాతో క్లాస్ లో మాస్ ఉంటుంది మాస్ లో క్లాస్ ఉంటుంది అని రుజువు అయితే.. సుకుమార్ కూడా మాస్ డైరక్టర్ అయిపోయినట్లేనేమో.
రంగస్థలం సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. హీరో గా రామ్ చరణ్ హీరోయిన్ గా సమంత నటిస్తుండగా.. యాంకర్ అనసూయ ఒక ముఖ్యమైన రోల్ చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. రానున్న సంక్రాంతికి రంగస్థలం 1985ను వెండితెరపై చూడొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/