Begin typing your search above and press return to search.
చరణ్ సినిమాకి డైరెక్టర్ మారుతున్నాడా?!
By: Tupaki Desk | 1 Nov 2015 8:07 AM GMTరామ్ చరణ్ సినిమాపై నిన్నటివరకు ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు ఉండేవి కాదు. ఎందుకంటే స్వయంగా చరణే ఆ సినిమా వివరాల్ని పలు సందర్భాల్లో ప్రకటించాడు కాబట్టి! కానీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొంటాయో ఎవ్వరికీ తెలియదు కదా. ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లేవరకు అందులో ఎవరు నటిస్తారో, ఎవరు మధ్యలో వెళ్లిపోతారో అర్థం కాదు. కొన్నిసార్లయితే సగం షూట్ చేశాక కూడా హీరోయిన్లు మారిపోతుంటారు. అలా ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో మార్పులు చేర్పులు అంటూ కొత్త ప్రచారం మొదలైంది. అందులో నిజమెంతన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తమిళ చిత్రం `తని ఒరువన్`ని రామ్ చరణ్ రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. ముచ్చటపడి మరీ దానయ్యతో ఆ సినిమా రీమేక్ రైట్స్ ని కొనిపించారు చరణ్. దర్శకుడిగా కూడా సురేందర్ రెడ్డిని ఎంపిక చేసుకొన్నాడు. అయితే ఇంతలో విడుదలైన `బ్రూస్ లీ` సరైన ఫలితం సాధించకపోవడంతో ఆ ఎఫెక్ట్ రామ్ చరణ్ కొత్త సినిమాపై పడింది. దానయ్యకి భారీగా నష్టాలు రావడంతో కొత్త సినిమా గురించి పునరాలోచనలో పడ్డాడట. దీంతో ఆ ప్రాజెక్టు నిర్మాతలు అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ ల చేతికి వెళ్లినట్టు తెలుస్తోంది. రీమేక్ రైట్స్ కొన్నాడు కాబట్టి ఒక భాగస్వామిగా మాత్రమే దానయ్య వ్యవహరించబోతున్నాడట. సినిమాకి సంబంధించిన కీలక నిర్ణయాలు అల్లు అరవింద్ తీసుకొనే అవకాశం రావడంతో ఇప్పుడు డైరెక్టర్ ని కూడా మార్చే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం.
తమిళ దర్శకుడు రాజాతోనే సినిమాని తీయించాలన్న ఆలోచనలో అల్లు అరవింద్ ఉన్నాడట. కిక్2తో సురేందర్ రెడ్డికి ఫెయిల్యూర్ వచ్చింది కాబట్టి, రామ్ చరణ్ కి బ్రూస్ లీ తో ఫెయిల్యూర్ వచ్చింది కాబట్టి... వాళ్లిద్దరూ కలిసి పనిచేస్తే కొత్త ప్రాజెక్టుకి అంత క్రేజ్ రాకపోవచ్చని, అందుకే దర్శకుడిని మార్చేద్దామని అల్లు అరవింద్ సూచిస్తున్నాడట. అయితే రామ్ చరణ్ మాత్రం సురేందర్ రెడ్డికి ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోవడం ఇష్టం లేక ఆలోచిద్దామని అంటున్నాడట. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.