Begin typing your search above and press return to search.
ఆ వేడుకలో రామ్ చరణ్.. అబ్బే కష్టం
By: Tupaki Desk | 27 Nov 2017 8:00 AM GMTప్రస్తుతం హైదరాబాద్ మొత్తం చర్చించుకుంటున్న అంశం ఇవాంకా ట్రంప్. గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ సందర్బంగా ట్రంప్ కుమార్తె, ఆయన ప్రత్యేక సలహాదారు ఇవాంకా గారు మొదటి సారి భారతగడ్డపై అడుగుపెడుతుండడంతో సీఎం దగ్గరి నుంచి కామన్ మ్యాన్ వరకు చాలా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇక ఆమె రాజసం ప్రవర్తించే తీరు ఏ విధంగా ఉంటుందా అని చాలా మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే మీడియాలలో ఆమె సెక్యూరిటీపై అనేక కథనాలు వెలువడ్డాయి.
ఇకపోతే సీఎం అయినా ఎవరన్నా అయినా ఆమె దగ్గరకి వచ్చే ముందు యూఎస్ సెక్యూరిటీ చాలా జాగ్రత్తలు తీసుకోనుందట. ఇక సభకు హాజరు అయ్యే వివరాలను మొత్తం సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ముందుగానే తెలుసుకున్నారని తెలుస్తోంది. అయితే మొన్నటి వరకు ఈ వేడుకకు టాలీవుడ్ సినీప్రముఖులు హాజరు కాబోతున్నారు అని టాక్ బాగానే వచ్చింది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ అని కథనాలు వెలువడ్డాయి. కాని అదంతా జరిగే పని కాదని ఇప్పుడు తెలుస్తోంది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో నో-ప్రోటోకాల్ పేరుతో అసలు లోకల్ లీడర్లను (మేయర్ తో సహా) కూడా పిలవట్లేదు. అలాంటప్పుడు ఇక్కడి సినిమా ప్రముఖులను పిలిస్తే బాగోదుగా మరి.
28 నుంచి స్టార్ట్ కాబోయే GES 2017 వేడుకలో చరణ్ ఉంటాడని కార్య నిర్వాహకులు మీడియాకు ఇచ్చిన మొదటి నోట్ లో మెన్షన్ చేయడం.. ఆ తరువాత నోట్ లో తీసేయడం ఇప్పుడు ఫ్యాన్స్ ను నిరాశపరిచిందట. అయితే ఈ కార్యక్రమంలో నిజానికి ప్రొడక్షన్ హౌస్ ఉన్న ఏ నటుడైనా లేదా ఏ ప్రొడ్యూసరైనా పాల్గొనొచ్చు. కేంద్రం ఆహ్వానం మేరకు ఆల్రెడీ చాలామంది దేశవిదేశాల నటులు కం ప్రొడ్యూసర్లు అయినా వారు విచ్చేస్తున్నారు. మరి 'కొణిదెల ప్రొడక్షన్స్' అధినేతను పిలుస్తారా? లేదా? అనే విషయంపై క్లారిటీ లేదు. ఇకపోతే చరణ్ కూడా సైరా సినిమా పనులతో బిజీగా ఉన్నందున.. ఈ GES 2017 వేడుకను హాజరు కాలేని పరిస్థితి అని కూడా టాక్ వినిపిస్తోంది.