Begin typing your search above and press return to search.
రామ్‌చరణ్‌కు అలాంటి ఫీలింగే లేదు
By: Tupaki Desk | 17 March 2015 7:44 AM GMTమనం చూస్తూనే ఉంటాం.. చాలామంది దర్శకులు అగ్ర హీరోలందరితోనూ సినిమాలు చేస్తుంటారు. కాని వీరి ఆడియో ఫంక్షన్స్‌లో ప్రస్తావించేటప్పుడు మాత్రం పక్క క్యాంపు హీరోలతో చేసిన సినిమాలను మాత్రం ప్రస్తావించరు. మొన్ననే టెంపర్ ఆడియో లాంచ్‌లో పూరి జగన్ గురించి ప్రస్తావిస్తూ.. ఒక్కటంటే ఒక్క మెగా హీరో మూవీ గురించి కాని, మహేష్ గురించి కాని పూరి జగన్‌పై వేసిన ప్రత్యేక ఆడియో-విజువల్‌లో చెప్పకపోవడమే అందుకు నిదర్శనం.
ఇక ఇలాంటి పరిస్థితులను రూపుమాపాలంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద స్టార్ హీరోలే ఓపెన్ అప్ అవ్వాలి. అదిగో మొన్న పరశురామ్ అనే పిల్లాడిని రామ్‌చరణ్ కలిసినప్పుడు ఒక సూపర్బ్ సీన్ చోటుచేసుకుంది. మగధీర డైలాగులు చెబుతూ ఒరిజినల్ మగధీరుడిని ఆకట్టుకున్న ఈ పిల్లాడు, మొన్న చరణ్‌ను కలసినప్పుడు కొన్ని సినిమాల డైలాగులు చెప్పాడు. అయితే ఈ పిల్లాడికి ముందే మరి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో తెలియదు కాని.. అయ్యో ఇక్క లెజండ్ సినిమా డైలాగ్స్ చెప్పకూడదు అనేశాడు. పిల్లాడికేం తెలుసండీ ఈ వెర్రీ ఫ్యానిజం గురించి.. అందుకే ఉన్న మాట చెప్పాడు.
దాంతో వెంటనే చెర్రీ ఒక మాటన్నాడు.. ''ఎవరు చెప్పొద్దన్నారు.. బాలయ్య అంటే నాకూ చాలా ఇష్టం.. లెజండ్ మూవీ కూడా ఇష్టం.. పర్లేదు ఆ సినిమాలోని డైలాగులు చెప్పూ'' అన్నాడు. దాంతో వెంటనే కుర్రాడు లెజండ్‌లోని డైలాగులు పేల్చాడు. ఇక అంతకముందే కుర్రాడు ఎన్టీఆర్, రవితేజల డైలాగ్స్ కూడా చెప్పాడులేండి. అయితే బాలయ్య డైలాగ్స్‌ను చెప్పొద్దంది ఎవరు? ఆ విషయం పక్కనెట్టేస్తే సాక్షాత్తూ చరణ్ వంటి లీడింగ్ స్టారే అలా ఓపెన్‌గా చెప్పినప్పుడు ఇక ఆడియో ఫంక్షన్స్‌లో పక్క క్యాంప్ హీరోలను దాచేసే సాంప్రదాయానికి స్వస్తీ పలకాలేమో.